స్వర్ణాంధ్ర 2047 ప్రథమ బహుమతి సాధించిన ఆదర్శ పాఠశాల విద్యార్థి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : స్వర్ణాంధ్ర 2047 పోటీల్లో కొత్త చెరువు జిల్లాపరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల వేదికగా నిర్వహించిన స్వర్ణాంధ్ర2047 జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలలో ధర్మవరం ఆదర్శ పాఠశాల లో తొమ్మిదవ తరగతి చదువుతున్న తారకరామాపురానికి చెందిన చిట్టా లక్ష్మీ నివాస్ ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. 32 మండలాల నుంచి మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారిణి (డీఈవో)మీనాక్షి విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ పద్మశ్రీ ,వైస్ ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు. (Story : స్వర్ణాంధ్ర 2047 ప్రథమ బహుమతి సాధించిన ఆదర్శ పాఠశాల విద్యార్థి)