ప్రజలకు చేసిన సేవలే ప్రభుత్వ ఉద్యోగికి మంచి గుర్తింపు తెస్తుంది
వెంకట శివరామిరెడ్డి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రజలకు చేసిన సేవలే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మంచి గుర్తింపు తెస్తుందని బదిలీ అయినా ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో వీడ్కోల సభను ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు సభకు ముఖ్యఅతిథిగా ఎన్డీఏ కార్యాలయ, మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తో పాటు డి ఐ లు మురళీకృష్ణ శామ్యూల్ బాబు, డిఏఓ. కతిజున్ కుప్రా పాల్గొన్నారు. అనంతరం డిఏఓ కతి జూన్ కుప్రా, రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల ఎమ్మార్వోలు నటశేఖర్, మునుస్వామి, భాస్కర్ రెడ్డి, స్వర్ణలత, రమాదేవి, సురేష్ బాబు జమీనుల్లా ఖాన్ మాట్లాడుతూ ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి ఎన్నికల నిమిత్తం ధర్మవరం కి రావడం ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో వారికి వారే సాటి గా ఉంటూ ఉన్నతాధికారుల వద్ద మంచి గుర్తింపును పొందడం జరిగిందన్నారు. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ పరిధిలో దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను కూడా జిల్లా కలెక్టర్లతో చర్చించి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. బదిలీలు అనేది ప్రభుత్వ ఉద్యోగులకు సర్వసాధారణమని, ఆ బదిలీగా వచ్చినప్పుడు ప్రజలకు చేసిన సేవలు తగిన ప్రాధాన్యతను ఇస్తాయని తెలిపారు. తదుపరి వెంకట శివరామిరెడ్డి మాట్లాడుతూ తాను ఎన్నికల నిమిత్తం ధర్మవరంకు రావడం నా అదృష్టంగా భావిస్తానని, అందరి అధికారులు సిబ్బంది సహాయ సహకారములతో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడం నాకెంతో గర్వంగా ఉందని, ఇందుకు సహకరించిన అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు సిబ్బందికి పేరుపేరునా తాను కృతజ్ఞతలను తెలుపుతున్నానని తెలిపారు. విధుల సమయంలో తాను ఏమైనా ఆగ్రహము మాట్లాడి ఉంటే అది కేవలం డ్యూటీ పట్ల మాత్రమే నిర్వర్తించడం జరిగిందని వారు తెలిపారు. ప్రతి రెవెన్యూ ఉద్యోగి తన విధులను సేవాభావంతో బాధ్యతతో నిర్వర్తించినప్పుడే అందరికీ మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. తదుపరి రెవెన్యూ డివిజన్లోని ఏడు మండలాల ఎమ్మార్వోలు, విభాగ అధికారులు, సిబ్బంది, మంత్రి ముఖ్య అనుచరులు హరీష్ బాబు కలిసి బదిలీగా వెళుతున్న వెంకట శివరామిరెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. (Story ; ప్రజలకు చేసిన సేవలే ప్రభుత్వ ఉద్యోగికి మంచి గుర్తింపు తెస్తుంది)