UA-35385725-1 UA-35385725-1

అనిమియా ముక్తుతెలంగాణా గోడ పత్రిక ఆవిష్కరణ

అనిమియా ముక్తుతెలంగాణా గోడ పత్రిక ఆవిష్కరణ

డాక్టర్ అప్పయ్య

న్యూస్ తెలుగు /ములుగు : ములుగు జిల్లా కలెక్టర్ టి ఎస్ దివాకర చేతుల మీదుగా ‘అనిమియా ముక్తు తెలంగాణ’ గోడ పత్రికను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగిందని, జిల్లా వైద్య అధికారి అల్లెం అప్పయ్య తెలిపారు. ఈ సందర్బంగా అప్పయ్య మాట్లాడుతూ 1_19 వయసుగల పిల్లల లో రక్తహీనతను తగ్గించే బాధ్యత, వైద్య ఆరోగ్యశాఖ ,ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ల మీద ఉన్నదని, ఈ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా పనిచేసి, ఆరోగ్యవంతమైన పిల్లలను తయారు చేయాలని వారు కోరారు.అంగన్ వాడి పిల్లలలకు(1_5) రక్తహీనత ఉన్నట్లయితే ఐరన్ పోలిక్ సిరప్, పాఠశాలల పిల్లలలో(6_9) రక్తహీనత ఉన్నట్లయితే పింక్ ఐరన్ ఫోలిక్ మాత్రలు, 10_19 వయసుగల పిల్లలకు బ్లూ ఐరన్ మాత్రలు ఇవ్వాలని తెలిపారు . దీనితోపాటు పిల్లలు బహిరంగ మలవిసర్జన చేయకూడదని, చేతులు సబ్బుతో శుభ్రంగా కడుగు కోవాలని, కాఫీ ,టీ లాంటి పానీయాలు తీసుకోకుండా, పాలు ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలు సి _విటమిన్ కలిగిన సిట్రస్ పండ్లు, గుడ్లు చేపలు, మటన్ లాంటి పోషక పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని, ఈ మూడు శాఖలు, అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం పిల్లల ఆరోగ్యము, ఇమ్యునైజేషన్జేషన్ అధికారి. డాక్టర్ రణధీర్, జిల్లా సంక్షేమ అధికారి శిరీష, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి చంద్రకళ , డిప్యూటీ మాస్ మీడియా అధికారి సంపత్ ,సామాజిక ఆరోగ్య అధికారి పూర్ణ సంపత్ తదితరులు పాల్గొన్నారు. (Story : అనిమియా ముక్తుతెలంగాణా గోడ పత్రిక ఆవిష్కరణ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1