రాజకీయ దుర్బుద్ధితో బాబు ప్రచారం
మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : రాజకీయ దుర్బుద్ధితో కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు చేస్తున్న అబద్ధపు ప్రచారాలతో వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను అపవిత్రం చేసిన క్రమంలో…చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని వెంకటేశ్వరస్వామిని ప్రార్ధించేందుకు, పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల తిరుపతికి వెళ్ళేందుకు నిర్ణయించడం జరిగింది. కాని జరిగిన పరిణామాల దృష్ట్యా ఒకపక్క శాంతిభద్రతల సమస్య, మరోపక్క డిక్లరేషన్ కు సంబంధించి కావాలనే రచ్చ చేయడం మంచిది కాదని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడుకు సద్బుద్ధి ప్రసాదించాలని, రాష్ట్రం బాగుండాలని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత, తిరుపతి లడ్డు విశిష్టత మరింత ముందుకు తీసుకువెళ్ళి భక్తుల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించేందుకు శనివారం వినుకొండ పట్టణం లోని శ్రీ కృష్ణ దేవాలయం లో వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు పి. గౌతమ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి మీడియా తో మాట్లాడారు. లడ్డు తయారీకి వాడే నెయ్యి లో కల్తీ జరిగింది అని అనడం దానికి వారి అనుచరులు పదే పదే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం తప్ప అక్కడ ఏ విధమైన కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వం నియమించిన ఈ.ఓ. చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కావాలనే కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం లబ్ది పొంలని చూస్తున్నారని, అసలు దేవుడిని దర్శించుకోవడానికి ఆంక్షలు ఏంటి అని ప్రశ్నిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీటీడీ ట్రస్ట్ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్ 12 నుంచి నెయ్యి సరఫరా చేసారున్నారు, అంటే అప్పటికి ఉంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రి, ఇలా జూన్ నెల మొత్తం సరఫరా చేసిన తరువాత జులై 6 న రెండు, జులై 12 మరో రెండు ట్యాంకర్లు టీటీడీ టెస్ట్ లో ఫెయిల్ కావడం జరిగింది. ఆ ట్యాంకర్ల వెనక్కి పంపడం జరిగింది. ఈ విధంగా టీటీడీ టెస్ట్ లో ఫెయిల్ ఐయిన నెయ్యి ని వాడకపోయినా వాడరని ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూడటం చాలా పాపం అని అన్నారు. తాను 30 సంవత్సరాల నుండి డైరీ ఫీల్డ్ లో ఉన్నానని అసలు నెయ్యి లో ఏదైనా వేరే కొవ్వు పదార్థం కలిపితే విపరీతమైన వాసన వస్తుందని, కావాలంటే బాగా అనుభవం ఉన్న డైరీ ల్యాబ్ టెక్నీషియన్లను కనుకోండి అన్నారు. చంద్రబాబు కి కూడా డైరీ వ్యవస్థ ఉందని ఆలా కల్తీ కలపడం కుదరదు అని ఆయనకి తెలుసు, కానీ రాజకీయం లబ్ది కోసమే ఇదంతా చేస్తున్నారని అన్నారు. (Story : రాజకీయ దుర్బుద్ధితో బాబు ప్రచారం)