సమాజ మార్పు కోసం పోరాడిన మహాకవి గుర్రం జాషువా
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలర్పించిన భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం, కుల,మత,వర్ణ వివక్షలతో కుమిలిపోతున్న సమాజ మార్పు కోసం పోరాడిన మహాకవి గుర్రం జాషువా ఆశయాల సాధన కోసం యువత ముందుకు సాగాలి…… సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్…..
కుల మత వర్ణ వివక్షలను తన కలము అనే ఆయుధ ఖడ్గంతో ఖండ ఖండాలుగా దునుమాడిన మహాకవి గుర్రం జాషువా,,స్వాతంత్ర్య ఉద్యమంలో తెల్లదొరలను ఈ దేశం నుండి తరిమికొట్టే మహోద్యమంలో తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన సర్దార్ భగత్ సింగ్ జయంతి కార్యక్రమాలు ఈరోజు యువత దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించు కొంటున్నారని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ అన్నారు.
అతి పిన్న వయసులో సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎందరో త్యాగధనులు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించారని వారిలో సర్దార్ భగత్ సింగ్ 129వ జయంతిని ఈ రోజున దేశవ్యాప్తంగా యువత జరుపుకుంటున్నారని దేశం కోసం పోరాడుతున్న జాతీయ నాయకుడు లాలా లజపతిరాయ్ ని స్కాట్ ఆధ్వర్యంలో లాఠీ చార్జీ చేసిన నేపథ్యంలో దీనికి ఆదేశాలు జారీ చేసి లాఠీ చార్జికి కారకుడైన సాండర్సును కాల్చి చంపిన ధీరోదాత్తుడు సర్దార్ భగత్ సింగ్ అన్నారు. భగత్ సింగ్ స్వాతంత్ర్య ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుటకు ఢిల్లీ అసెంబ్లీ హాలులో రెండు పొగ బాంబులు విసిరడం జరిగింది.తద్వారా భగత్ సింగ్ మరియు బటుకేశ్వర దత్తులు కోరుకున్నట్లే దట్టంగా పొగ వ్యాపించింది అచటి నుండి వారు పారిపోవుటకు అవకాశం ఉండి కూడా పారిపోయే ఉద్దేశం లేని సర్దార్ భగత్ సింగ్, దత్తు లు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ లాంగ్ లీవ్ ద రెవల్యూషన్ అంటూ కరపత్రాలు విసిరారు. అచటికి చేరిన పోలీసులు వారిద్దరిని అరెస్టులు చేశారు. సాండర్స్ హత్య కేసు, అసెంబ్లీలో బాంబు దాడి, సహరాన్పూర్ లో బాంబు తయారీ ఫ్యాక్టరీ కేసులు మోపబడి భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ మరో 21 మంది పై హత్యాభియోగాలు మోపబడ్డాయి. తెల్లదొరల కోర్టుల విచారణ అనంతరం మార్చి 23 1931 లాహోర్ సెంట్రల్ జైల్లో ఉరితీయడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఉరికి ముందు ఏదైనా కోరుకోమని జైలు అధికారులు అడిగినప్పుడు ఎలాంటి కోరికలు లేవని దేశం కోసం ప్రాణాలర్పించటం నాకు చాలా సంతోషంగా ఉందని తన మాటగా ఆయన చెప్పడాన్ని భారతదేశ యువతరం పులకించిపోయింది. అటువంటి యువకిశోరాలు అనేకులు దేశం కోసం ప్రాణాలర్పిస్తే ఏ ఆశయాల కోసమైతే వారు ప్రాణత్యాగాలు చేశారో ఆ ఆశయాలు దేశంలోని పేద బడుగు బలహీన వర్గాలు కార్మికులు కష్టజీవులు రైతులు నేటికీ దేశంలో పోగవుతున్న సంపద అందరికీ దక్కడం లేదని కేవలం మూడు శాతం మంది బడా కుబేరులు దేశంలోని 90 శాతం కష్టజీవుల శ్రమజీవుల కష్టాన్ని దోచుకుంటున్నారని దానికి నేటి పాలకులు చట్టాలు కేంద్ర ప్రభుత్వం ఊతమిస్తోందని ఆయన విమర్శించారు.
సిపిఐ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 129వ జయంతి…..
*మహాకవి కవి కోకిల గుర్రం జాషువా నాటి ఉమ్మడి గుంటూరు జిల్లా నేటి పల్నాడు జిల్లాలోని వినుకొండ ప్రాంతం చాట్రగడ్డపాడు నివాసిగా పెరిగి పెద్దవాడై ఉన్నత విద్యలను అభ్యసించారు. ఆనాటి గ్రామీణ ప్రాంత వర్ణ కుల వివక్షలను అవమానాలను ఎదుర్కొంటూ తీవ్రమైన ఆవేదనతో తన కలం అనే ఖడ్గముతో వర్ణ,కుల వివక్ష పై అనేక కవితలతో ప్రజలను చైతన్యపరచి పోరాడారని ప్రజలను చైతన్య పరచారని ఆయన అన్నారు. నాటి హరిశ్చంద్ర పద్య నాటకాలలో రాజు పేద తేడా లేని కాటిసీను గురించి నీతి వాక్యాలలో హరిశ్చంద్రుడిలా సత్యం కోసం నీతి కోసం ఇచ్చిన మాట కోసం నిలబడిన ఒక గొప్ప రాజుగా ఆయనను పేర్కొనడం జరిగిందని అన్నారు. నిమ్న జాతులు కులాల ప్రజలు గుడిలో దేవుని చూచుటకు కులాల అంతరాలతో దేవుని గుడి గడప దాటనీయని నేపథ్యంలో గర్భగుడి లోనికి ప్రవేశించే “గబ్బిలం”గురించి అమ్మా గబ్బిలమా గుడిలో దేవుని దర్శించుటకు స్పృశించుటకు అర్హులము కాని మమ్ములను దేవునికి మేము చెప్పుకొను మాటలు నీ ద్వారా తెలియపరచవా అని గబ్బిలానికి వేడుకోలు కవిత్వాన్ని తన కవితా కౌశల్యముతో రచించి ప్రజలను కంటతడి పెట్టించిన కవితా మాధుర్యం గొప్పదని ఆయన అన్నారు. అటువంటి మహాకవి కలలుగన్న స్వరాజ్యం సమ సమాజం కులమత వర్ణ వివక్ష అంతరాలు లేని భారతదేశం కోసం ఆయన అనేక ఇబ్బందులను అవమానాలను భరించి ముందుకు సాగిపోయారని అటువంటి మహాత్ముల త్యాగాలకు వారి ఆశయాల సాధనకు నేటి యువత నేటి ప్రజానీకం కట్టుబడి ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బోదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించి నిర్వహించగా కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము సిపిఐ నాయకులు ఆర్. వందనం, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, ఎ. పవన్ కుమార్, షేక్ కిషోర్, కె. మల్లికార్జున,సోమవరపు దావీదు, ధూపాటి మార్కు, కత్తి నవీన్, షేక్ మస్తాన్, జల్లి వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, కామేశ్వరరావు, కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. (Story :సమాజ మార్పు కోసం పోరాడిన మహాకవి గుర్రం జాషువా)