Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌లయోలా స్కూల్ ఆడిటోరియంలో సిఏవి. ప్రసాద్

లయోలా స్కూల్ ఆడిటోరియంలో సిఏవి. ప్రసాద్

లయోలా స్కూల్ ఆడిటోరియంలో సిఏవి. ప్రసాద్ సంస్మరణ సభ

న్యూస్‌తెలుగు/వినుకొండ : లయోలా స్కూల్ ఆడిటోరియంలో రిటైర్డ్ ఆర్జెడి కీర్తిశేషులు సిఏవి. ప్రసాద్, ప్రధమ సంస్మరణ సభ గురువారం జరిగింది. ఈ సభలో సిఏవి. ప్రసాద్, తో చదువుకున్న తోటి పూర్వ విద్యార్థులు అనేకమంది ఈ సభకు పలు ప్రాంతాల నుండి విచ్చేశారు. ఈ సభలో రిటైర్డ్ ఎంఈఓ పాలపర్తి విజయభాస్కర్, రిటైర్డ్ ఓఎన్జిసి చీప్ మేనేజర్ డి. ఎన్. రాజ్ కుమార్, రిటైర్డ్ డిఇఓ కనుమూరు. జాషువా, రిటైర్డ్ రిజిస్టర్ గంగవరపు జగజీవన్, ఎస్ డి వి. ప్రసాద్, రిటైర్డ్ డాక్టర్ మోహన్ రావు, రిటైర్డ్ హెడ్మాస్టర్ మంద జేమ్స్, వాట్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వి. భూషణం అధ్యక్షత వహించగా, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కె. వై. నాగయ్య, సమన్యాయ కర్తగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఏవి. ప్రసాద్, సోదరుడు రిటైర్డ్ ఎంఈఓ సిహెచ్.జాన్ సుందర్ రావు, కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలత కృపాకర్ స్వాగతం పలుకగా స్థానిక న్యాయవాది పిజె. లూకా వందన సమర్పణ చేశారు. మరియు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అచ్యుత రావు, పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. (Story: లయోలా స్కూల్ ఆడిటోరియంలో సిఏవి. ప్రసాద్ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!