UA-35385725-1 UA-35385725-1

బాధితులకు సత్వరమే న్యాయం అందించండి

బాధితులకు సత్వరమే న్యాయం అందించండి

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

న్యూస్ తెలుగు /వరంగల్: ములుగు :
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు చట్టలకు లోబడి న్యాయం అందించాలని, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధ్వర్యంలో నేర సమీక్షా సమావేశాన్ని గురువారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో నిర్వహించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ముందుగా పెండింగ్ లో వున్న ప్రధాన కేసుల దర్యాప్తు వాటి పురోగతి, కేసుల్లోని నిందితుల అరెస్టులో ఆలస్యం అవ్వడంలో గల ప్రధాన కారణాలపై పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ వారిగా పోలీస్‌ అధికారులతో సమీక్షా జరిపారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు పలుసూచనలు, సలహాలను అందజేస్తూ కేసుల దర్యాప్తులో విషయంలో అధికారులు ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్దతిను కూడా అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలని,అలాగే కేసు నమోదయిన వారంరోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలన్నారు.స్టేషన్‌ అధికారులు ప్రతి రోజు ఒక గంట పాటు పెండింగ్‌ కేసులను సమీక్షా జరపాలని, దర్యాప్తులో వున్న కేసుల్లో బాధితులకు వీలైనంత వరకు న్యాయం చేయాలన్నారు.ప్రజా వాణి, డీజీపి కార్యాలయం నుండి వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి క్షేత్ర స్థాయిలో విచారణ చేయాలని,పోలీస్‌ అధికారుల పనితీరుపైనే వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కీర్తి ప్రతిష్టలు అధారపడి వుంటాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. అనంతరం శాంతి భద్రతల అంశాలపై పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై నిరంతరం నిఘా వుండాలని, బాలికలు, మహిళల మిస్సింగ్‌, ఆపరహణ కేసుల్లో ఆలసత్వం వహించకుండా, సత్వరమే చర్యలు తీసుకోవాలనిపేర్కొన్నారు.గతంలో నమోదైన గంజాయి కేసుల్లో తప్పించుకొని తిరుగుతున్న నిందితులను పట్టుకోనేందుకుగాను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, కమిషనరేట్‌ పరిధిలో నిరంతరం కార్డన్‌ సెర్చ్‌ తనీఖీలు నిర్వహించాలని, అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు సెప్టీ విభాగంతో కల్సి పనిచేయాలన్నారు.ముఖ్యంగా రొడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేసి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని, ప్రధానంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముమ్మరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు తనీఖీలు చేపట్టాలని తెలిపారు.అలాగే ట్రిపుల్‌ సి విభాగం నుండి వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకొవడం జరిగిందనే దానిపై ఎప్పటికప్పుడు అధికారులు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు.ఈ సమావేశంలో డిసిపిలు షేక్‌ సలీమా, రాజమహేంద్ర నాయక్‌,రవీందర్, అదనపు డిసిపిలు, సంజీవ్‌,సురేష్‌కుమార్‌తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు,ఎస్‌.ఐలు పాల్గోన్నారు. (Story : బాధితులకు సత్వరమే న్యాయం అందించండి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1