మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఘనస్వాగతం
న్యూస్‌తెలుగు/విజయనగరం : మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం కోరుకొండ సైనిక్ స్కూల్‌కుకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్‌పి వకుల్ జిందాల్, సైనిక్‌స్కూల్ ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి సైనిక పాఠశాలలో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆ పాఠశాల విద్యార్ధులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఆర్‌డిఓ ఎంవి సూర్యకళ, లైజనింగ్ అధికారి మురళీకృష్ణ, తహసిల్దార్ కూర్మనాధరావు, సైనిక పాఠశాల ఇతర అధికారులు పాల్గొన్నారు. (Story : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఘనస్వాగతం)