Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌భారత్ టెక్ లీగ్ పోటీలలో పోర్ట్ సిటీ విద్యార్థులు ప్రతిభ

భారత్ టెక్ లీగ్ పోటీలలో పోర్ట్ సిటీ విద్యార్థులు ప్రతిభ

భారత్ టెక్ లీగ్ పోటీలలో పోర్ట్ సిటీ విద్యార్థులు ప్రతిభ

న్యూస్‌తెలుగు/ విజయనగరం : అటల్ టింకరింగ్ ల్యాబ్ లు ఉన్న స్కూళ్ళకు టీ కి బాట్ నిర్వహించిన ‘భారత్ టెక్ లీగ్ ‘ పోటీలు నాలుగు అంశాలలో మూడుస్థాయిలలో నిర్వహించారు. ఈ పోటీలకు ఆంధ్రప్రదేష్, తెలంగాణా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 150 పాఠశాలల నుండి సుమారు 600 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఆదివారం ఏయూ కళాశాలలో మూడవ స్థాయి పోటీలను నిర్వహించారు. దీనిలో మొదటి ,ద్వితీయ స్థాయిలలో పట్టణంలో రింగు రోడ్డు వద్ద ఉన్న పోర్ట్ సిటీ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు వీరిలో పాఠశాలలో 9వ తరగతి చదువు తున్న విద్యార్థులు శ్యామ్ మనోహర్, డి.సాయి పార్థసారథి, మెహర్ శ్రీ తరుణ్ ‘రోబోటిక్స్’ అంశంలో తమ ప్రతిభ అనబరిచి ప్రథమస్థానాన్ని కైవసం చేసుకున్నారు. అదే విధంగా డ్రోన్ టెక్నాలజీ విభాగంలో ఎండి రెహన్, భద్రగిరి ఉదయ్ కుమార్, ఎం తేజ ద్వితీయా స్థానాన్ని సాంధించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కేఏపీ రాజు శివ వీరిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధంగా తమ పాఠశాల విద్యార్థులు మూడు స్థాయిలలో కూడా తమ ప్రతిభను కనబర్చి విజయం సాధించడం చాలా గర్వకారణం గా ఉందన్నారు. ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనల్లో మిగిలిన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ చంటి రాజు, డైరెక్టర్లు మధు, అశోక్, నీలిమ తదితరులు పాల్గొన్నారు. (Story : భారత్ టెక్ లీగ్ పోటీలలో పోర్ట్ సిటీ విద్యార్థులు ప్రతిభ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments