UA-35385725-1 UA-35385725-1

పరిశుభ్రత, ఆరోగ్యం అనేవి జీవన ప్రమాణాలకు మూల స్తంభం

పరిశుభ్రత, ఆరోగ్యం అనేవి జీవన ప్రమాణాలకు మూల స్తంభం

ఎన్డీఏ కూటమి నాయకులు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పరిశుభ్రత ఆరోగ్యం అనేవి జీవన ప్రమాణాలకు మూల స్తంభాలు అవుతాయని ఎన్డీఏ కూటమి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్ ఐదో వార్డులో శుభ్రత కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ సిబ్బంది, బిజెపి నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలను నాటారు. మంత్రి కార్యాలయ ఇన్చార్జ్ హరీష్, ఎన్డీఏ నాయకులు మాట్లాడుతూ…. ఈ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యత కలిగినది, ఎందుకంటే పరిశుభ్రత అనేది ఆరోగ్యం మరియు జీవన ప్రమాణాలకు మూలస్తంభంగా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించబడతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, వాతావరణాన్ని మెరుగుపరచడం పర్యావరణ సంరక్షణపై చర్చించడం ప్రధాన లక్ష్యంగా ఉంటుందన్నారు. ఈ విధంగా, సమాజంలో సానుకూల మార్పులను తీసుకువచ్చి, ప్రజలలో సామూహిక భాగస్వామ్యం , పర్యావరణను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. శుభ్రత పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రజల ఆరోగ్యం సుస్థిరతను పెంచడంలో ఈ కార్యక్రమం కీలకపాత్ర పోషిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది, మంత్రి కార్యాలయ సిబ్బంది, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, టిడిపి నాయకులు పాల్గొన్నారు. (Story : పరిశుభ్రత, ఆరోగ్యం అనేవి జీవన ప్రమాణాలకు మూల స్తంభం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1