బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులుని పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్ తెలుగు /వనపర్తి :పెబ్బేరు పట్టణ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు దిలీప్ రెడ్డి గారు రాత్రి గుండేపోటుకు గురై మేడికోవర్ (హైదరాబాద్)హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. ఒత్తిడి తగ్గించుకొని ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.(Story:బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గారిని పరామర్శించిన మాజీ మంత్రి)