UA-35385725-1 UA-35385725-1

జానీ మాస్ట‌ర్ మెడ‌కు ఉచ్చు!

జానీ మాస్ట‌ర్ మెడ‌కు ఉచ్చు!

డ్యాన్స్ కెరీర్ ముగిసిన‌ట్లేనా?

ప్ర‌ముఖ డ్యాన్స్ మాస్ట‌ర్ జానీ మాస్ట‌ర్ మెడ‌కు ఉచ్చు బిగుసుకుంటోంది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను కష్టాలు వీడటం లేదు. ఓ యువతి ఫిర్యాదుతో జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇటు డ్యాన్స‌ర్ల సంఘం, అటు జ‌న‌సేన అత‌నిపై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. నిర్మాత‌లు కూడా త‌మ ఒప్పందాలు ర‌ద్దు చేసుకునే ప్లాన్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

కేసు ఏమిటంటే..

జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదయింది. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. ఫిర్యాదు చేసిన యువతి వయసు 21 సంవత్సరాలు. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. కాగా ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని అక్కడికి బదిలీ చేశారు. ఔట్ డోర్ షూటింగులలో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి కేసును బదిలీ చేశారు.

దీంతో జనసేన పార్టీ జానీ మాస్టర్‌ను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం కొరియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా షేక్ జానీ ఉన్నారు. ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఓ యువతి జానీ మాస్టర్‌పై అత్యాచారం ఆరోపణలు చేయడంతో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఓ వ్యక్తి చేసిన పొరపాటు వలన అసోసియేషన్‌కు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో జానీ మాస్టర్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం కొరియోగ్రాఫర్స్‌ అత్యవసర సమావేశం జరగనుంది. సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో ఈరోజు (సోమవారం) జరగాల్సిన అసోసియేషన్ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. జానీ మాస్టర్‌ను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంపై రేపు నిర్ణయం తీసుకోనున్నారు. యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నారు.

సస్సెండ్ చేస్తారా..

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జానీ మాస్టర్‌ను కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి యూనియన్‌లో ఎవరినైనా సస్పెండ్ చేయాలంటే సమావేశం ఏర్పాటుచేసి అందరి అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకుంటారు. అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూనియన్‌లో ఏవైనా పదవుల్లో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు చర్యల విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై అసోసియేషన్‌ను ఏర్పాటు చేసినప్పుడే కొన్ని నిబంధనలు పెట్టుకోవడం జరుగుతుంది. దీనినే యూనియన్ బైలాస్ అంటారు. అసోసియేషన్ నిబంధనల ప్రకారం జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని యూనియన్ సభ్యులు కోరుతున్నారు. ఒకవేళ జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి నిబంధనలు అంగీకరిస్తాయా.. లేదంటే ఆయన సభ్యత్వాన్ని రద్దుచేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సభ్యత్వం రద్దు చేస్తే ఆయన తన అధ్యక్ష పదవిని కోల్పోతారు. యూనియన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాలంటే రేపటి వరకు వేచిచూడాలి.

జ‌న‌సేన చ‌ర్య‌లు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన అధిష్టానం షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అత‌ను జ‌న‌సేన‌కు స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ఉన్న విష‌యం తెల్సిందే. ఆ పార్టీకి కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైన నేపథ్యంలో జ‌న‌సేన పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

ఇక జానీ మాస్టర్‌ లైంగిక వేధింపుల కేసులో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదుతో జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు IPC 376, 323, 506 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌లో ఢీ షో ద్వారా పరిచయం ఏర్పడినట్లు చెప్పిన బాధితురాలు.. ఓ రోజు ఫోన్ చేసి పిలిచి అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చినట్లు తెలిపింది.

అయితే జానీ మాస్టర్‌ దగ్గర జాయిన్‌ అయినరోజు నుంచీ వేధింపులు మొదలయ్యాయని, ప్రతీసారి తన సెక్స్ కోరిక తీర్చమని వేధించేవాడని బాధితురాలు వాపోయింది. అంతేకాదు కోరిక తీర్చకుంటే ఇండస్ట్రీలో ఒక్క ఆఫర్‌ కూడా రానివ్వకుండా చేస్తానని బెదిరించాడు. షూటింగ్‌ జరుగుతున్న టైమ్‌లో నా వ్యాన్‌లోకి వచ్చి తన ప్యాంట్ జిప్‌ తీసి నాపై బలవంతం చేశాడు. నేను నో చెప్పేసరికి నా తలను అద్దంకేసి కొట్టాడు. మణికొండలోని నా ఫ్లాట్‌కు అర్ధరాత్రులు వచ్చి కోరిక తీర్చమని చాలాసార్లు నాపై దాడి చేశాడు. కానీ నేను ఏనాడు జానీ మాస్టర్‌కు లొంగలేదు. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. నన్ను శారీరకంగా, మానసికంగా వేధించిన జానీ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోండి’ అంటూ ఫిర్యాదులో పేర్కొంది. (Story: జానీ మాస్ట‌ర్ మెడ‌కు ఉచ్చు!)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1