ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ఘన సన్మానం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఇటీవల ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు శ్రీ పలుస శంకర్ గౌడ్ వనపర్తి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని గౌని అరుంధతి , జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు బి. దుర్గాప్రసాద్ గార్లను పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.. సమాజంలో విద్యార్థులకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్తులో వారు ఉన్నత స్థితికి చేరడానికి దోహదపడే మార్గదర్శకులు ఉపాధ్యాయులు.. అలాంటి ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాలను గౌరవిస్తూ వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. (Story : ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ఘన సన్మానం)