UA-35385725-1 UA-35385725-1

ప్రభుత్వ భూములను ను అడవులను కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోవాలా..?

ప్రభుత్వ భూములను ను అడవులను కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోవాలా..?

వైసిపి పాలనలో జరిగిన భూకబ్జాలకు టిడిపి పాలనలో ప్రోత్సాహమా..?

న్యూస్ తెలుగు /చాట్రాయి : వైసిపి పాలనలో ప్రభుత్వ భూములు చెరువు పోరంబోకులు ఆక్రమించుకొని వలస వచ్చిన భూస్వాములు దర్జాగా అనుభవించే వారికి టిడిపి పాలనలో కూడా ప్రోత్సాహం లభిస్తుందా అని పలువురు చర్చించుకోవడం గమనార్హం. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న చాట్రాయి మండలం కృష్ణారావు పాలెం గ్రామంలో ఆర్ ఎస్ నెంబర్ 51/9 లో సుమారు 75 సెంట్ల ప్రభుత్వ భూమిలో వైసిపి పాలనలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పరిశీలన చేసిన భూమిని నూజివీడు కి చెందిన ఒక భూస్వామి వైసిపి ప్రముఖుల నాయకుల అండతో ఆక్రమించుకొని తన భూమిలోకి వెళ్లడానికి దారి వేసుకోవడమే కాకుండా ప్రభుత్వ భూమి మొత్తానికి తీగ రాళ్లు వేసి దర్జాగా సాగు చేసుకుంటూ ఆ పక్కనే ఉన్న చెరువు భూమిని కూడా రెండు ఎకరాలకు పైగా ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న విషయాన్ని పత్రికలలో ప్రత్యేక కథనాలు ప్రచురించడంతో తాసిల్దార్ పరిశీలించి ప్రభుత్వ భూమిని స్వాదీనం చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలినదే. ఈ నేపథ్యంలో గడిచిన రెండు రోజులుగా వైసీపీ ప్రముఖ నాయకులు టిడిపి నాయకులను మంత్రి దగ్గర దిగువ స్థాయిలో పనిచేస్తున్న అంతరంగికులను అంటకాగుతున్నట్లు వదంతులు వినవస్తున్నాయి. వైసిపి పాలనలో బూరుగూడెం , పోతనపల్లి గ్రామాలలో ప్రముఖ వ్యక్తులు భూములు అమ్మకాలలో వ్యాపారాలలో వారి భూములు సరిహద్దులో ఉన్న చెరువులు డొంక భూములు ఆక్రమించుకుని వేరే వారికి అమ్మిన విషయాలు కూడా ఆధారాలతో ఇటీవల బయటపడటంతో విడగొట్టి వాటిలో రోడ్లు వేసుకున్న ఘటనలు కూడా ఇటివల జరిగాయి. భూములు కొనుగోలు చేసిన వారు వెళ్లి అమ్మిన వారిని అడుగగా ప్రస్తుతం మన ప్రభుత్వం లేదు ఏమి చేయలేం అంటూ చేతులెత్తేసారని కొనుగోలు చేసిన వారు గగ్గోలు పెట్టిన పరిస్థితి ఏర్పడిందని విన వచ్చింది. అదేవిధంగా పట్టా భూములు పక్కన ఉన్న ప్రభుత్వ భూములు చెరువులు అడవులు ఆక్రమించుకుని వాటికి పట్టాదార్ పాస్ బుక్కులు వచ్చే విధంగా చేసుకుని ఆ భూములు అమ్ముకున్నారని కూడా వదంతులు వినవస్తున్నాయి. సోమవారం గ్రామంలో అడవి భూములను కూడా ఒకేసారి 50,60 ఎకరాలకు పాస్ బుక్ ఇప్పించే ప్రయత్నం చేయగా ఆ ఒత్తిడిలో రెవెన్యూ అధికారి ప్రాణాలు కోల్పోయినట్లు కూడా పెద్ద ఎత్తున అప్పట్లో చర్చలు జరిగాయి. కోట్ల రూపాయల్లో కుంభకోణం జరిగిందని పెద్ద ఎత్తున వదంతులు వినవచ్చాయి. రెవెన్యూ అధికారి ఎందుకు చనిపోయారు అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కొంత మంది పార్టీ పేరు, మంత్రి పేరు వాడుకుంటూ అడవి భూములకు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు పాస్బుక్కులు ఇవ్వాలని రెహెన్యూ వారిని నిరంతరం టార్చర్ చేయడం బ్లాక్ మెయిల్ చేయడం పరిపాటిగా మారిందని పలు ఆరోపణలు వినపడుతున్నాయి. ఇది ఇలా ఉంటే గతంలో తాసిల్దార్ విశ్వనాథ రావు కాలంలో ఆఫీసులో పని చేసిన ప్రైవేటు వ్యక్తి భూముల వివరాలు ఉన్న లాప్ టాప్ తో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలా ల్యాప్టాప్ లో ఏముంది ఎవరి భూములు ఎవరికి రాశారు అంతా అయోమయం. తహసిల్దార్ కృష్ణారావు పాలెం పరిశీలనకు వెళ్లి వచ్చిన దగ్గర నుండి చాట్రాయి మండలంలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు. వైసిపి పాలనలో జరిగిన భూ కబ్జాలను అవినీతి అక్రమాలను తెలుగుదేశం పాలకులు వెనకేసుకు వస్తారా….? వాస్తవాలను వెలికి తీస్తారా……? అనేది ప్రశ్నార్థకంగా మారింది (Story : ప్రభుత్వ భూములను ను అడవులను కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోవాలా..?)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1