Homeవార్తలుతెలంగాణచదువుతోపాటు సంస్కారం, మానవతా విలువలు నేర్పించాలి

చదువుతోపాటు సంస్కారం, మానవతా విలువలు నేర్పించాలి

చదువుతోపాటు సంస్కారం, మానవతా విలువలు నేర్పించాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : విద్యాపర్తిగా పేరొంది దినదిన అభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం శుభసూచకమని, విద్యార్థులకు విలువలతో కూడిన చదువు, సంస్కారం, తల్లిదండ్రులపై భక్తిశ్రద్ధలు ఉండేలా విద్యా బోధన చేయాలని దాంతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను రాణించేలా ప్రత్యేక దృష్టి సారించాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన “బచ్ పన్” పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన సొంత ప్రాంతం మీద ఉన్న అభిమానంతో ఎంతో కొంత సేవ చేసుకోవాలన్న దృక్పథంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేసిన మీ రాసీపల్లి శ్రీనివాసులు గారికి, ఆయన కుమారులకు Mla అభినందనలు తెలియజేశారూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటును అందిస్తుందని ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ లాంటి అనేక వాటిపై దృష్టి సారించి ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక విద్యాసంస్థలు ఉండేలా చర్యలు చేపడుతుందని అన్నారు . ఈ మధ్యనే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఒక నూతన చట్టం తీసుకువచ్చారని, తల్లిదండ్రులను సరిగా చూసుకోలేని వ్యక్తుల జీతాల నుంచి 10 నుంచి 15 వేల రూపాయలను అందజేసే విధంగా చట్టం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పలువురు నిరుద్యోగులకు అందుకు సంబంధించిన బుక్ మెటీరియల్ ను పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ గారు, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, స్థానిక కౌన్సిలర్. క్రాంతి గౌడ్, పాఠశాల యాజమాన్యం పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : చదువుతోపాటు సంస్కారం, మానవతా విలువలు నేర్పించాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!