మంచినీటి సమస్యను తీర్చాలని కమిషనర్ కి వినతి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణములో మరి ముఖ్యంగా 19వార్డులో గత వారం రోజులుగా తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నదని అధికారులను సంప్రదిస్తే కరెంట్ సమస్య,లీకేజీల సమస్య వల్ల ఆలస్యం జరుగుతుందని చెబుతున్నారని వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి మంచినీరు సక్రమంగా అందించాలని 19వార్డు కౌన్సిలర్ మురళీ సాగర్ కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది,రంజాన్ పండుగలు ఒకేసారి రావడం జరుగుతుంది అని ఇటువంటి సమయములో మంచి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.(Story : మంచినీటి సమస్యను తీర్చాలని కమిషనర్ కి వినతి )

