Homeవార్తలుతెలంగాణరైతులు తమ పొలాల వెంబడి పోతున్న గ్యాస్ పైప్ లైన్ లీకేజీ కాకుండా తగు జాగ్రత్తలు...

రైతులు తమ పొలాల వెంబడి పోతున్న గ్యాస్ పైప్ లైన్ లీకేజీ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి

రైతులు తమ పొలాల వెంబడి పోతున్న గ్యాస్ పైప్ లైన్ లీకేజీ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : ఎల్‌పీజీ గ్యాస్ పైప్‌లైన్ వద్ద 18 మీటర్ల పరిధిలో ఎటువంటి తవ్వకాల పనులు చేయరాదని రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. బుధవారం వనపర్తి మండల పరిధిలో పెద్ద గూడెం గ్రామంలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఇంటర్మీడియట్ పిగ్గింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆఫ్‌సైట్ మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తమిళనాడులోని హసన్ నుండి 650 కిలోమీటర్ల లో చర్లపల్లికి వెళుతున్న హిందూస్తాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ (హెచ్. పి సి ఎల్) గ్యాస్ పైప్ లైన్ వనపర్తి జిల్లాలోని పెబ్బేరు, వనపర్తి, ఘనపూర్ గుండా హైదరాబాద్ లోని చర్లపల్లికి చేరుకొని అక్కడి నుండి సిలిండర్లు నింపి గృహావసరాలకు పంపిణీ అవుతుంది. ఈ పైప్ లైన్ వెళుతున్న గ్రామ పరిధిలో ఎక్కడైనా పొరపాటున గ్యాస్ పైప్ లైన్ లీకేజీ అయితే భారీ నష్టం జరగకుండా ఏ విధంగా నివారించాలి అనే విషయాల పై హెచ్.పి.సి.ఎల్ కంపెనీ వారు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌పీసీఎల్‌కు చెందిన అన్ని స్పందన బృందాలు (Response Teams) పాల్గొని పైప్ లైన్ లీకేజీలు ఏర్పడినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించాయి. ఎల్‌పీజీ పైప్‌లైన్ లీకేజీ జరిగిన సందర్భంలో అమలు చేసే ఎమర్జెన్సీ విధానాన్ని స్పష్టంగా వివరించారు. భద్రతా చర్యలు, పైప్‌లైన్ లీకేజీ నివారణ (curing) ప్రక్రియలను సమగ్రంగా చూపించడం, హెచ్ పి సీఎల్ కు చెందిన ఉన్నతాధికారులు డీజీఎం అనూజ్ బరోనియా, ఆపరేషన్స్ మేనేజర్ శశిధర్ రెడ్డి వివరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్‌పీజీ గ్యాస్ పైప్‌లైన్ చుట్టూ 18 మీటర్ల పరిధిలో ఎటువంటి తవ్వకాల పనులు చేయరాదని రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. రైతులు తమ పొలాల వెంబడి పోతున్న గ్యాస్ పైప్ లైన్ లీకేజీ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్యాస్ పైప్ లైన్ తమ పొలాల్లో ఎక్కడి నుండి వెళుతుందో గ్రామస్తులు, రైతులకు అవగాహన ఉండాలని సూచించారు. పైప్ లైన్ కేవలం 1.5 మీటర్ల లోతులో ఉంటుంది కాబట్టి పైప్ లైన్ కు ఎడమ వైపున 6 మీటర్లు, కుడివైపున 12 మీటర్లు మొత్తం 18 మీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు జరపవద్దని సూచించారు. పొరపాటున ఏదైనా గ్యాస్ లీకేజ్ గుర్తిస్తే సమీపంలోని సైన్ బోర్డు పై రాసి పెట్టిన నెంబరు కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. జిల్లాలో పైప్‌లైన్ వెళ్లే ప్రాంతాల సమీపంలోని రైతుల వివరాలను సేకరించి, ప్రభుత్వ తరఫున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని కోరారు. ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్ లీకేజీ ప్రమాదాల నివారణకు హెచ్పీ సీఎల్ నిర్వహించిన మాక్ డ్రిల్ అవగాహన కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.ఈ సందర్భంగా మాక్ డ్రిల్ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ కు హెచ్పీసీఎల్ అధికారులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాథ్, డి ఎం హెచ్ ఓ సాయినాథ్ రెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సంబంధిత శాఖల అధికారులు, హెచ్‌పీసీఎల్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.(Story : రైతులు తమ పొలాల వెంబడి పోతున్న గ్యాస్ పైప్ లైన్ లీకేజీ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!