Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండలో జగనన్న కాలనీని సందర్శించిన సిపిఐ నాయకులు

వినుకొండలో జగనన్న కాలనీని సందర్శించిన సిపిఐ నాయకులు

వినుకొండలో జగనన్న కాలనీని సందర్శించిన సిపిఐ నాయకులు

నివాసయోగ్యంగా లేని జగనన్న కాలనీ. ముళ్ళ చెట్ల పొదలతో వసతి లేని గుంతల రోడ్లతో జగనన్న కాలనీ.

మంచినీరు దొరకక జగనన్న గృహాలలో నివాసం లేని ప్రజల బాధలు.

ఆనాడు ఇల్లు కట్టుకొనుటకు డబ్బులు లేవని జగనన్న కాలనీ బాధితుల మొర వినని జగన్ ప్రభుత్వం.

బ్యాంకులలో అప్పులు ఇప్పించి మరి ఇళ్ళు కట్టించిన గత ప్రభుత్వం మౌలిక వసతులు మరిచింది.

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండలో జగనన్న కాలనీకి మంచినీరు వసతి కల్పించి రోడ్లు సైడ్ కాలువలు నిర్మించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాడు సిపిఐ వినుకొండ నియోజకవర్గ నాయకులు నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు బృందంతో కలిసి జగనన్న కాలనీ ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్కడ నివాస గృహాల బాధితులకు మంచినీళ్లు దొరకక, రోడ్లు వేయక, సైడ్ కాలువలు నిర్మించక వినుకొండ పట్టడానికి సరైన రవాణా సౌకర్యం లేక వేలాది గృహాలు పాడుబడి ఉన్నాయని, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన గృహాలను కూటమి ప్రభుత్వమైన వసతులు కల్పించి అక్కడ నివాసితులకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. గత “జగన్ ప్రభుత్వం”నిర్మించిన ఈ కాలనీ ఆనాడు బ్యాంకులలో అప్పులు ఇప్పిస్తామని డ్వాక్రా గ్రూపుల వారితో వాలంటీర్లతో ఒత్తిడి చేసి కట్టించి కనీస మౌలిక వసతులు కల్పించలేదని, ఈ పరిస్థితులలో ఒక్కరు కూడా నివాస ఉండ లేని విధంగా వేలాది గృహాలు పాడుబడి పోయాయని అవి శిథిలావస్థ స్థితికి చేరుకున్నాయని, ఆ గృహాలకు బిగించిన చెక్కలు తలుపులు కిటికీలు దొంగలు ఊడదీసుకుపోతున్నారని అన్నారు. ఈ గృహాలన్నీ ప్రభుత్వ సొమ్ము తో నిర్మించినవేనని ఈ డబ్బంతా ప్రజల సొమ్మేనని ఈ కాలనీ బాగు చేసి ప్రజలకు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈనెల 24న వినుకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలము ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా నిర్మించి ఉన్న టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, అరకొరగా నిర్మించి ఉన్న జగనన్న కాలనీల మౌలిక వసతులు పూర్తిగా కల్పించి నివాసితులకు భరోసా కల్పించి ఇవ్వాలని. డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య హాజరవుతున్నారని జగనన్న కాలనీ బాధితులు టిడ్కో గృహాల లబ్ధిదారులు రెండు మూడు సెంట్లు ఇంటి స్థలానికి అర్జీలు పెట్టినవారు అందరూ ఈ ధర్నాకు హాజరు కావలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, మండల కార్యదర్శులు రాయబారం వందనం, కొప్పరపు మల్లికార్జునరావు, దారి వేముల మరియబాబు, షేక్ మస్తాన్, సోడాల సాంబయ్య, మరియమ్మ, రాములమ్మ, తదితరులు నివాసితులు పాల్గొన్నారు.(Story : వినుకొండలో జగనన్న కాలనీని సందర్శించిన సిపిఐ నాయకులు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!