Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి.

ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి.

ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి.

న్యూస్ తెలుగు/చింతూరు :తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని కాంక్షిస్తూ పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల అమరణ నిరాహార దీక్షకు నివాళిగా సోమవారం మొహమ్మద్ జమాల్ ఖాన్ టిడిపి మండల అధ్యక్షులు వారి ప్రాంగణంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1952 డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి 11 గంటల 22 నిమిషాల సమయంలో 58 రోజుల కఠోర ఉపవాస దీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు తుదిశ్వాస విడిచారని అప్పటికి ఆయన శరీరం పూర్తిగా సుస్కించి పోయిందని ఆకలి బాధకు తాళలేక ఆయన ఎన్నోసార్లు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం నరకం చేసి చూశారని ఆయన త్యాగ ఫలితమే నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి సగర్వంగా మనమందరం తల ఎత్తుకొని తిరుగుతున్నామని మద్రాస్ రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు అనేక రకాల ఇబ్బందులకు గురి అయ్యామని పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే నేడు ఆంధ్రులుగా గర్విస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు కొనియాడారు. లక్ష సాధనలో వెనుకంజ వేయకుండా ఆనాటి పాలకులకు ఎదిరించి రాష్ట్రాన్ని సాధించిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు ప్రాణాలు సైతం తృణప్రాయంగా ధారపోసారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టిడిపి అధ్యక్షులు మొహమ్మద్ జహంగీర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు పీ సాల్మన్ రాజు, కట్ట శంకర్, ఎండి రియాజ్, షేక్ షరీఫ్, జ్ఞాన సుందర్ బాబు పాల్గొన్నారు.(Story : ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి. )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!