బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకి 18 వేయిల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి
48 గంటల ధర్నా లో CITU నాయకుల డిమాండ్
న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18000గా నిర్ణయించాలని వనపర్తి జిల్లా కేంద్రంలోని మరీకుంట ధర్నా చౌక్ లో ఈ రోజు CITU ఆధ్వర్యంలో 48గంటల ధర్నా ప్రారంభించిన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు R N రమేష్, మండ్ల రాజు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సునీత, బుచ్చమ్మ మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం ఆశ వర్కర్లును 10 సంవత్సరాల కాలం పాటు మోసగిస్తే విసిగి చెందిన ఆశ వర్కర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించి రెండు సంవత్సరాల పూర్తయి నేటికీ ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయకపోవడం సిగ్గుచేటని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈనెల 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి వారికి సరిపడా బడ్జెట్ను కేటాయించాలని ఫిక్స్డ్ వేతనం 18000గా నిర్ణయించి జీవో జారీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న రెండు నెలల వేతనాలని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1500 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న పారితోషికాలతో కలిపి ఇవ్వాలని కోరారు. ఆరు నెలల పిఆర్సి ఏరియల్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.PF, ESI సౌకర్యం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించకుంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయకపోతే ఆశా వర్కర్ల ప్రతాపం చూపించవలసి వస్తుందని, ఆశ వర్కర్ల యొక్క సహనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షించొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్,జిల్లా నాయకులు నందిమాళ్ళ రాములు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు గిరిజమ్మ, దేవమ్మ చెన్నమ్మ అనిత, ఇందిరా, తార, గోవిందమ్మ, లత, శాంతమ్మ, బాలకృష్ణమ్మ, భాగ్యమ్మ, శ్యామలమ్మ, మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.(Story : బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకి 18 వేయిల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి )

