వినుకొండ పట్టణ అభివృద్దే ధ్యేయం
పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించిన చీఫ్ విప్ జీవి
రూ. 55 లక్షల సిసి రోడ్లు, డ్రైన్లు ప్రజలకు అంకితం
2 ఏళ్లలో శాశ్వత త్రాగునీటి పథకం పూర్తి
నియోజకవర్గ అభివృద్ధిపై అధిష్టానం నుండి జీవీకీ ఏ . గ్రేడ్ రావడంతో అభివృద్ధి పై దూకుడు పెంచిన జీవి…
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణ సమగ్రాభివృద్దే ధ్యేయమని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పురపాలక సంఘం పరిధిలో పూర్తి అయిన సిసి రోడ్లు, డ్రైన్లు పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జివీ ఆంజనేయులు శనివారం ప్రారంభించారు. పట్టణంలోని 30 వ వార్డు హనుమాన్ నగర్ జీరో లైన్ లో 30 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు మరియు డ్రైనేజీ పనులను ప్రారంభించారు, అలాగే 15వ వార్డు శాలివాహన నగర్ 2వ లైన్ లో 15 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు, డ్రైన్ ను ప్రారంభించారు. 16వ వార్డ్ నవాజ్ కుంట వద్ద 10 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించడం జరిగింది. మొత్తం, 55 లక్షల వ్యయంతో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ పూర్తయిన అభివృద్ధి పనులతో పాటు, ఈద్గా అభివృద్ధికి 40 లక్షలు నిధులు కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. 4 లక్షల తో కరెంటు లైనింగ్ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల విన్నతి మేరకు నవాజ్ కుంట వద్ద రెండు పబ్లిక్ ట్యాపులు వేయించడం జరుగుతుందన్నారు. 99 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని, పట్టణంలోని 32 వార్డుల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. వినుకొండ పట్టణానికి 240 కోట్లతో శాశ్వత త్రాగునీటి పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేయడం చేయటం జరుగుతుందని స్పష్టం చేశారు. స్థానిక నరసరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పి స్థలంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం, ఘాట్ రోడ్, గిరి ప్రతిక్షణ రోడ్డు త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు. వినుకొండ అభివృద్ధిలో వేగంగా దూసుకు వెళ్తుంటే జీర్ణించుకోలేని వైసిపి అసత్య ప్రచారాలు చేయటం సరికాదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నిరాధారమైన ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేయడం వలనే వైసీపీకి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. స్వర్ణాంధ్ర విజన్ -2047 లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీలా, మున్సిపల్ కమిషనర్ కె.శివరామ ప్రసాద్, పట్టణ పార్టీ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, చికెన్ బాబు, రియల్ ఎస్టేట్ జానీ, సౌదాగర్ జానీ, అజీజ్, పి అయూబ్ ఖాన్, గుంజి కాళింగా రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : వినుకొండ పట్టణ అభివృద్దే ధ్యేయం )

