స్వచ్ఛ సర్వేక్షన్‌లో ఉత్తమ ర్యాంకే లక్ష్యం
నారాయణ టెక్నో స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు
న్యూస్ తెలుగు/వినుకొండ : స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో వినుకొండ మున్సిపాలిటీకి ఉత్తమ ర్యాంక్ సాధించే లక్ష్యంతో శుక్రవారం స్థానిక నారాయణ టెక్నో స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కె. శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తడి, పొడి, హానికర వ్యర్థాలను వేరు చేయాలని, తడి చెత్తతో కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని కమిషనర్ విద్యార్థులకు వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లలో వేడి ఆహారం తెచ్చుకుంటే క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని, వాటికి బదులు క్లాత్, జ్యూట్ బ్యాగులు, స్టీల్ బాక్సులు వాడాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో, కాలువల్లో చెత్త వేయకుండా ‘విజువల్ క్లీన్ వినుకొండ’ సాధనకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్ వాష్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఐఎల్ఎస్జి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శివ పార్వతి, నారాయణ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ మంగళపూడి హెచ్.వి. రెడ్డి, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.(Story : స్వచ్ఛ సర్వేక్షన్‌లో ఉత్తమ ర్యాంకే లక్ష్యం )

