Homeవార్తలుసురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కిడ్నీ ఆరోగ్య అవగాహన కార్యక్రమం

సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కిడ్నీ ఆరోగ్య అవగాహన కార్యక్రమం

సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కిడ్నీ ఆరోగ్య అవగాహన కార్యక్రమం

​  షుగర్, బీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి

న్యూస్ తెలుగు/వినుకొండ  : ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వినుకొండలోని సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ.. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యంగా షుగర్, రక్తపోటు (బీపీ) సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కిడ్నీ వ్యాధుల నిపుణులు డాక్టర్ అన్నా మణికంఠ సురేష్ మాట్లాడుతూ.. కిడ్నీ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ప్రపంచ కిడ్నీ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. అలాగే, డాక్టర్ గ్రంధి మృదుల తేజస్వి మాట్లాడుతూ.. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గ్రంధి మృదుల తేజస్వి, డాక్టర్ దస్తగిరి షకీలా, మున్సిపల్ కమిషనర్ కె శివరామ ప్రసాద్, స్థానిక ప్రముఖులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.(Story : సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కిడ్నీ ఆరోగ్య అవగాహన కార్యక్రమం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!