Homeవార్తలుతెలంగాణభూసేకరణ, ఇతర పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి

భూసేకరణ, ఇతర పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి

భూసేకరణ, ఇతర పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ, ఇతర పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ కే శివకుమార్ నాయుడు ఆదేశించారు. తెలంగాణ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు గురువారం నాడు వనపర్తి జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు . ఈ పర్యటనలో భాగంగా ఆయన ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న పలు నీటిపారుదల ప్రాజెక్టుల భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలు, పునరావాస పనుల పురోగతి అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో గణపసముద్రం ప్రాజెక్టులో భాగంగా పెండింగ్లో ఉన్న 197 ఎకరాల భూసేకరణకు వెంటనే ఎంజాయ్మెంట్ సర్వే పూర్తిచేసి ప్రిలిమినరీ నోటిఫికేషన్ దారి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కర్నె తాండ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి పెండింగ్ 26 ఎకరాల భూసేకరణకు పెగ్ మార్కింగ్ ఈనెల 14వ తేదీలోపు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద డి 1, డి 5, డి 8, ప్యాకేజ్ 29 కు సంబంధించి 92 ఎకరాల భూసేకరణకు పెగ్ మార్కింగ్ త్వరగా వారంలోపు కంప్లీట్ చేయాలి అన్నారు. ఘనపూర్ బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి మార్కింగ్ పూర్తయిన 31 ఎకరాల భూమికి సంబంధించి సర్వే శాఖ అధికారులు వెంటనే ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు కొత్తకోట మండల పరిధిలోని కానాయిపల్లి ఆర్ అండ్ ఆర్ సెంటర్ తో పాటు, శంకర సముద్రాన్ని సందర్శించిన కమిషనర్ అరెండర్ సెంటర్లో పెండింగ్ అంశాలను త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ నాగేందర్, ఎస్ ఈ చంద్రశేఖర్, ఈ ఈ కేశవరావు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సర్వే ఏడి శ్రీనివాసులు, ఇతర రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.(Story : భూసేకరణ, ఇతర పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!