కావూరి రాజకీయ జీవితం… ప్రజాసేవకు అంకితం
న్యూస్ తెలుగు/వినుకొండ : “మాజీ కేంద్రమంత్రి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మృతిపట్ల ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, కావూరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. తెలుగు రాష్ట్రాల్లో కీలక రాజకీయ నాయకుడిగా కావూరి పేరు ప్రఖ్యాతులు పొందారని, రాజకీయ ప్రస్తానం ఆసాంతం ప్రజాసేవే లక్ష్యంగా సాగిందన్నారు. చివరి శ్వాశ కూడా ప్రజాసేవకే అంకితమైందని, ఐదుసార్లు ఎంపీగా గెలిచిన కావూరి, యూపీయే ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర జౌళీశాఖ మంత్రిగా పనిచేశారని,ఆ సమయంలో కావూరి భారత జౌళి పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేశారన్నారు. తన రాజకీయ జీవితంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికే ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారని, పారదర్శకమైన ప్రజాసేవతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచారని,ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు, మచిలీపట్నం పార్లమెంట్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కావూరి, తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నిత్యం శ్రమించారని చీఫ్ విప్ జీవి ఒక ప్రకటనలో కొనియాడారు.(Story : కావూరి రాజకీయ జీవితం… ప్రజాసేవకు అంకితం )

