Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష

పల్నాడు జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష

0

పల్నాడు జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష

జిల్లా ఇన్చార్జి మంత్రి సహా ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరు

న్యూస్ తెలుగు/వినుకొండ  : పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల శాసనసభ్యులు, జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తోపాటు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, ఎస్పీ బి కృష్ణారావు లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పల్నాడు జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షణ, జిల్లా సమగ్ర అభివృద్ధి, నియోజకవర్గాల వారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. ప్రధానంగా పల్నాడు జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సంయుక్తంగా పనిచేసే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీఎం సూచించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, ఎమ్మెల్యేలు పనితీరును మరింత మెరుగుపరుచుకుని ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబుకు జీవి ఆంజనేయులు వివరించారు. సీఎం సమీక్ష అనంతరం జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పల్నాడు జిల్లా అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని, జిల్లా అభివృద్ధికి సీఎం సహకారాలు అండ దండలు అందిస్తున్నారని జీవి ఆంజనేయులు తెలిపారు.(Story : పల్నాడు జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version