Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆధ్యాత్మిక క్షేత్రంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని తీర్చిదిద్దుతాం 

ఆధ్యాత్మిక క్షేత్రంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని తీర్చిదిద్దుతాం 

ఆధ్యాత్మిక క్షేత్రంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని తీర్చిదిద్దుతాం 

విను, కొండకు మణిహారంగా నిర్మితమవుతున్న గిరి ప్రదర్శన రోడ్డు

గిరి ప్రదర్శన రోడ్డు పనులను పరిశీలించిన చీఫ్ విప్ జీవి

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. కొండ చుట్టూ జరుగుతున్న గిరి ప్రదర్శన రోడ్డు పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా ప్రోక్లైనర్ యంత్రాన్ని ఆయన నడిపి రోడ్డు నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ త్రేతా యుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు కొండపై శివలింగాన్ని ప్రతిష్టించారని అందుకే శ్రీ రామలింగేశ్వర స్వామి గా ప్రసిద్ధిగాంచడం జరిగిందన్నారు. సీత జాడ విన్న కొండగా ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన వినుకొండ కొండను ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి గాంచుతోందని అన్నారు. కొండపై శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణం, ఘాట్ రోడ్, గిరి ప్రదర్శన రోడ్డు నిర్మాణాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తమ హయాంలో నిర్మాణానికి నోచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వినుకొండ ప్రజల ఆకాంక్ష మేరకు కొండచుట్టూ 1.50 కోట్లతో తారు రోడ్డు వేయటం జరుగుతుందని, రెండు వైపులా మరో 20 అడుగులు గ్రావెల్ మట్టి రోడ్డు కూడా వేయడం జరుగుతుందన్నారు. అలాగే ఘాట్ రోడ్డు నిర్మాణానికి 12.50 కోట్లు అవసరమని ఇంజనీర్ అధికారులు నివేదించడం జరిగిందని, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా నిధులు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలో ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే త్వరితగతిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణం పూర్తవుతుందని వివరించారు. వినుకొండ పట్టణానికి శాశ్వత త్రాగునీటి పథకం ద్వారా 240 కోట్లు నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయని, ఇప్పటికే 30 కోట్లతో పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మిగిలిన పనులకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిందని, త్వరలో పనులు ప్రారంభమై వినుకొండకు శాశ్వత త్రాగునీటి పథకం పూర్తి అవుతుందని తెలిపారు. అవసరమైనచోట ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాలు చేపడుతున్నారని, పట్టణానికి ప్రతిరోజు త్రాగునీటి సరఫరా అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీలా, కూటమి నాయకులు ఎన్. శ్రీనివాసరావు, బొంకూరి రోశయ్య, పత్తి పూర్ణ, సౌదాగర్ జానీ, అజీజ్, పి. అయూబ్ ఖాన్, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీకి బాధ్యులు అచ్యుత కోటేశ్వరరావు, రెడ్డి నగేష్, తాతా సత్యనారాయణ, పి రవీంద్ర, జెట్టి శ్రీనివాసరావు, మాల్యాద్రి, ఆర్ అండ్ బి. డి ఈ. నాయక్, మున్సిపల్ కమిషనర్ కె. శివరామ ప్రసాద్, టి పి ఓ. వెంకట రామమ్మ, తదితరులు పాల్గొన్నారు.(Story : ఆధ్యాత్మిక క్షేత్రంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని తీర్చిదిద్దుతాం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!