గ్రామ కాంగ్రెస్ జెండానే ఎగరాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన సంస్థ గతంగా బలోపేతం అవ్వాలని, ఇందులో గ్రామ అధ్యక్షులతోపాటు బూత్ కన్వీనర్ల పాత్ర చాలా ప్రధానంగా ఉంటుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేనరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ఖిల్లా ఘణపురం, పెద్దమందడి మండలాల్లో ఏర్పాటుచేసిన మండల కమిటీ ఎన్నిక కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు పార్లమెంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని బావి భారత ప్రధాని గా చేసింతవరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్విరామంగా శ్రమించాలని అందుకు ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న గ్రామ మండల స్థాయి కమిటీలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా పార్టీ తరఫున ఏర్పాటు చేసే వివిధ విభాగంలో ఉండే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ పార్టీపరమైన ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని, పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని వారు సూచించారు. పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా గ్రామ అధ్యక్షులుగా మండలాధ్యక్షులుగా వివిధ ఆర్గనైజేషన్ లో ఉండి పార్టీ కార్యక్రమాల పట్ల మనకెందుకులే అనే ధోరణిని విడనాడాలని, మనకెందుకులే అనుకునే వారెవరు కూడా రాజకీయంగా రాణించలేరని, అలాంటి వారి సహవాసంలో మనం ఉండకూడదన్నారు. నాకేంటి అనే ధోరణి వదిలేసి నేనున్నాగా అంటూ పార్టీ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని అందరం కలిసి ముందుకెళ్తే గ్రామాల్లో మనకు ఎదురుపడే వారే లేరని ప్రతిపక్షాలన్నింటికీ పాతర వేయవచ్చునని వారన్నారు. గ్రామాల్లో ఎల్లవేళలా అందుబాటులో ఉండి పార్టీ కోసం పనిచేసే వారికి మొదటి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఉంటుందని వారు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వెనకబడి పోతున్నామని ప్రభుత్వం చేసే పనులను గ్రామంలోని ప్రతి గడపకు చేరవేయాల్సిన బాధ్యత మనకుందని వారు సూచించారు ఈ సందర్భంగా వారు ఖిల్లా ఘణపురం మండలం, పెద్దమందడి గ్రామ అధ్యక్షులకు సంబంధించినటువంటి ఆశావాహుల పేర్లను వారు సేకరించారు. అధ్యక్ష పదవి కోసం ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు దరఖాస్తు చేసుకోవడంతో దరఖాస్తుదారుల వివరాల పూర్వాపరాలను పరిశీలించి కమిటీని త్వరలోనే ప్రకటించినట్లు వారు తెలిపారు తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ జర్నల్ సెక్రెటరీ నందిమల్ల యాదయ్య, OBC జిల్లా అధ్యక్షులు కోట్ల రవి, వనపర్తి జిల్లా మాజీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, మాజీ జెడ్పిటిసి సభ్యులు సోలిపురం రవీందర్ రెడ్డి, వెంకటస్వామి, రమేష్ గౌడ్, వేణుగోపాలకృష్ణ, మండలాధ్యక్షులు విజయ్ కుమార్, పెంటయ్య యాదవ్, సాయి చరణ్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, క్యామ వెంకటయ్య, వెంకట్రావు, ఐ సత్య రెడ్డి, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య , న్యాయవాది తిరుపతయ్య, నందిమల్ల త్రినాథ్, మొగిలి సత్య రెడ్డి, చీర్ల జనార్ధన్, టైలర్ రవి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : గ్రామ కాంగ్రెస్ జెండానే ఎగరాలి )

