వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం
న్యూస్ తెలుగు/వినుకొండ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వినుకొండలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం వద్ద వాసవి క్లబ్, యూత్ క్లబ్ మరియు నిమ్స్ 24 హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. సేవలు అందించిన డాక్టర్లు ఎల్.ఎన్. రావు, డా.పార్వతి, డా.అభిషేక్, డా.రజినిలను ఈ సందర్భంగా వాసవి క్లబ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంపును ఏర్పాటు చేశామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వాసవి క్లబ్ అధ్యక్షులు కాసుల వెంకట రవీంద్ర సూచించారు. చిన్న వయసులోనే ఎముకల సమస్యలు వస్తున్నాయని, ముందస్తు గుర్తింపు ద్వారా వాటిని నయం చేయవచ్చని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అభిషేక్ తెలిపారు. నిమ్స్ 24 ఆసుపత్రిలో మోకాళ్ల మార్పిడి (జాయింట్ రీప్లేస్మెంట్) శస్త్రచికిత్సలు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టంగుటూరి వీరబ్రహ్మం, గర్రె నరసింహారావు, జి.వి.ఎల్. నాగేశ్వరరావు, మండవ వెంకట కిరణ్ కుమార్, గుర్రం బాల సాయికుమార్, దేసు హరికుమార్, గ్రంధిశీల బ్రహ్మానందం, గర్రె అనిల్ కుమార్ తదితర వాసవి క్లబ్ సభ్యులు, ఆర్య వైశ్యులు పాల్గొన్నారు.(Story : వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం )

