Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌  వినుకొండలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

 వినుకొండలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

0

 వినుకొండలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

 మహిళా రక్షణకు కఠిన చట్టాలు తేవాలి: ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము

న్యూస్ తెలుగు/వినుకొండ  : స్థానిక రైలు పేటలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా రైతు నాయకురాలు లింగా శైలజ నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మహిళలను దుశ్శాలువాలు, పూలమాలలతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ.. మహిళల గొప్పతనాన్ని వివరించారు. ప్రతి మహిళ ఒక ఆది పరాశక్తి అని, ఝాన్సీ లక్ష్మీబాయి, మదర్ థెరిస్సాలతో పోల్చారు. నేడు అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారని ప్రశంసించారు. అయితే, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు దృష్టి సారించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు తిరువీధుల రవణమ్మ, మక్కెన మాధవి, వరగాని మాధవి, మస్తానమ్మ, మునెమ్మ, మున్ని గౌసియా, లక్ష్మిలతో పాటు.. నాయకులు లింగారామయ్య, మస్తాన్, చిన్న, మునయ్య, నాగేశ్వరావు, శ్రీను, చీరాల అంజయ్య, దుర్గా రెడ్డి, తోట నరసింహారావు తదితరులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.(Story :  వినుకొండలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version