శ్రీ శ్రీ రంగనాయక స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రావుల
న్యూస్ తెలుగు/వనపర్తి : శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి శ్రీరంగాపురం దేవాలయం సందర్శించుకొని శ్రీ రంగనాయక్స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ దేశచరిత్రలో అత్యంత విశిష్టత,మహిమాన్విత క్షేత్రంగా శ్రీరంగాపురం దేవాలయం ప్రసిద్ధిగాంచింది అని దేవాలయ శిల్పకళ అద్భుతంగా రూపొందించబడ్డదని బి.ఆర్.ఎస్ హయాములో శ్రీరంగాపురం రిజర్వాయర్ నిర్మాణం చేసిన తర్వాత దేవాలయంతో పాటు మండల కేంద్రం అభివృద్ధి చెందిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి శ్రీరంగాపురం మండలాన్ని పర్యాటక కేంద్రంగా రూపొందించాలని సూచించారు. రాబోయే కాలంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తాను కలసి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. రావుల.చంద్రశేఖర్ రెడ్డి ని ఆలయ అధికారులు,పూజారులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి సన్మానించారు. శ్రీరంగాపురం బ్రహ్మోత్సవాల సందర్భంగా సాగుతున్న జాతరలో వ్యాపారులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. జిలేబి,బెండు బేతీసలు,చిరు స్వీట్స్ కొనుగోలు జేసి నాయకులకు,కార్యకర్తలకు అందజేసి ఉత్సాహంగా గడిపారు. రావుల వెంట జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్,సీనియర్ నాయకులు కర్రెస్వామి,వనం.రాములు,పృథ్వీరాజ్,దిలీప్రె డ్డి,రాజశేఖర్,ఎద్దుల.సాయి కుమార్ ,వెంకట్ స్వామి, శివప్రసాద్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి,ఎల్లారెడ్డి,వడ్డే.రమేష్,సందీప్ రెడ్డి, అఖిల్ చారి,మన్యం తదితరులు ఉన్నారు.(Story : శ్రీ శ్రీ రంగనాయక స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రావుల )

