అంకిత భావంతో పనిచేసే వారికి అన్నిచోట్ల గుర్తింపు ఉంటుంది
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న టి.భాస్కర్ పదోన్నతి పై సీనియర్ సహాయకులుగా జిల్లా సివిల్ సప్లయ్స్ కార్యాలయంకు వెళుతున్న సందర్బంగా గురువారం తహసిల్దార్ కార్యాలయం నందు సత్కరించి, వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ సురేష్ నాయక్ మాట్లాడుతూ. భాస్కర్ ఎంతో అంకితభావంతో పనిచేస్తూ ఇప్పటివరకు అధికారుల నుండి సిబ్బంది నుండి మన్నన పొందారని, అలాగే వెళ్లిన ప్రాంతంలో కూడా మంచి గుర్తింపు పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ మురళీధర్, ఆర్ ఐ శ్రీహరి, కార్యాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.(Story:అంకిత భావంతో పనిచేసే వారికి అన్నిచోట్ల గుర్తింపు ఉంటుంది)

