వాహనాలకు ఎల్ఈడీ లైట్ల వాడకం నిషేధించాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రోడ్లపై టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్ తో పాటు లారీలు, టిప్పర్లు, ప్రోక్లేన్లు,క్రేన్లు మొదలైన అన్ని వెహికిల్స్ కి అత్యంత కాంతివంతమైన ఎల్ఈడి హెడ్ లైట్స్ గా ఉపయోగిస్తున్నారు. ఈ ఎల్.ఈ.డి లైట్ల వలన ఎదురుగా వస్తున్న వాహనాలు నడిపే వారి కళ్ళలో అత్యంత కాంతివంతమైన కిరణాలు పడి రోడ్డు కనపడక ఎదురుగా వస్తున్న వాహనాలను గుద్దుకొని ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయి. చట్టప్రకారం ఎల్ఈడీ లైట్లు వాహనాలకు హెడ్ లైట్స్ గా వాడకూడదు. అయినా సుమారు 80 శాతం వాహనాలు ఈ ఎల్ఈడి లైట్ల ని హెడ్ లైట్స్ గా వాడుతున్నారు. ఈవిషయంలో రోడ్ ట్రాస్పోర్ట్ అథారిటీ వారు గాని, పోలీస్ శాఖ అధికారులు గాని ఏ విధమైన చర్యలు తీసుకోవటము లేదు.కావున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్పించుకొని ప్రజల ప్రాణాల భద్రత కొరకు రోడ్ లపై తిరిగే అన్ని రకాల వాహనాలు ఎల్ఈడి లైట్ల ని హెడ్ లైట్స్ గా వాడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని అనుముల నాగ ప్రసాద రావు కోరారు.(Story : వాహనాలకు ఎల్ఈడీ లైట్ల వాడకం నిషేధించాలి )

