Homeవార్తలుతెలంగాణప్రజా పాలన..ప్రగతి ప్రణాళికతో రేవంత్ రెడ్డికి ప్రజా ఆగ్రహం తప్పదు

ప్రజా పాలన..ప్రగతి ప్రణాళికతో రేవంత్ రెడ్డికి ప్రజా ఆగ్రహం తప్పదు

ప్రజా పాలన..ప్రగతి ప్రణాళికతో రేవంత్ రెడ్డికి ప్రజా ఆగ్రహం తప్పదు

న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రభుత్వం మార్చి 6నుండి జూన్ 12వరకు నిర్వహించబోయే ప్రజా పాలన..ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అభాసుపాలు కావడం తప్పదని బి. ఆర్. ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్ అన్నారు.పరిపాలన చేతకాక,ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమై రేవంత్ రెడ్డి రోజుకో నాటకాని తెరపైకి తెస్తున్నారని నందిమల్ల.అశోక్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలలో పెల్లుబికిన అసంతృప్తి,ఆగ్రహాని పక్కదోవ పట్టించడానికి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరిట కాలయాపనకు సిద్ధపడుతున్నారని 420హామీలు,ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలం కావడమే కాక కె.సి.ఆర్ అందించిన సంక్షేమ పథకాలు కె.సి.ఆర్ కిట్టు,కంటి వెలుగు,రైతు బంధు,రైతు బీమా,రైతు రుణ మాఫీ,24గంటల ఉచిత విద్యుత్,విద్యార్థులకు విద్యా బరోసా ఎగ్గొట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది అని అశోక్ దుయ్యబట్టారు. ప్రజా పాలన పేరిట గ్రామాలకు పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మా దగ్గరకు రావాలని నిలదీయాలని అశోక్ పిలుపునిచ్చారు.
రైతులకు యూరియా పంపిణీ చేయడం చేతకాని ప్రభుత్వం, సకాలంలో రైతు భరోసా ఇవ్వలేని ప్రభుత్వం,
గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు నివారించలేని ప్రభుత్వం.
2లక్షల ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం.వృద్ధులను,దివ్యాంగులకు ఆసరా పింఛన్లు ఇవ్వలేని ప్రభుత్వం,
మహిళలకు 2500 ఇవ్వలేని ప్రభుత్వం,కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వలేని ప్రభుత్వం,
బాలింతలకు కె.సి.ఆర్ కిట్టు ఇవ్వలేని ప్రభుత్వం,వృద్ధులకు కంటి వెలుగు పథకం ఇవ్వలేని ప్రభుత్వం
సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేయడానికి ప్రగతి ప్రణాళిక సిద్ధం చేసిందని అశోక్ తీవ్రంగా విమర్శించారు.ఎన్నికలలో అధికారం,ప్రలోభాలు,ధన ప్రవాహంతో గెలిచినంత మాత్రాన ప్రజల మద్దతు ఉందని అనుకోవడం మూర్ఖత్వం అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికావడం తప్పదని నందిమల్ల.అశోక్ జోస్యం చెప్పారు.ఈ సమావేశములో యువత అధ్యక్షులు సూర్యవంశం.గిరి,మైనారిటీ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్,సీనియర్ నాయకులు వెంకట్  సాగర్,సయ్యద్.జమీల్,మంద.రాము,విజయ్,సాయికుమార్ తదితరులు ఉన్నారు.(Story : ప్రజా పాలన..ప్రగతి ప్రణాళికతో రేవంత్ రెడ్డికి ప్రజా ఆగ్రహం తప్పదు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!