Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆదర్శప్రాయంగా ఏపీ విద్యావ్యవస్థ

ఆదర్శప్రాయంగా ఏపీ విద్యావ్యవస్థ

ఆదర్శప్రాయంగా ఏపీ విద్యావ్యవస్థ

 అసెంబ్లీ చర్చలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

 నాణ్యతాప్రమాణాల్లో 3వ స్థానంలో ఏపీ

 పేద విద్యార్ధులకు వరం “తల్లికి వందనం”

 మెగా “పేరెంట్స్-టీచర్స్” సమావేశం అద్భుతం

 దేశంలోనే ప్రధమ స్థానంలో నిలపడమే లక్ష్యం

 మంత్రి నారా లోకేష్ ఆలోచనల భేష్

న్యూస్ తెలుగు/వినుకొండ : దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తున్న విద్యావిధానం ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. శాసన సభ సమావేశాల్లో బుధవారం మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖలపై జరిగిన చర్చలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల ద్వారా విద్యాప్రమాణాలు గణనీయంగా పెరిగాయని జీవీ వెల్లడించారు. విద్యారంగ నాణ్యతా ప్రమాణాల్లో వైసీపీ హయాంలో 19వ స్థానంలో ఉన్న రాష్ట్రంలో నేడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషితో 3వ స్థానంలో నిలిచామన్నారు. దేశంలో నెం. 1స్థానం సాధించటమే లక్ష్యంగా రాష్ట్రంలో విద్యాశాఖ ముందుకెళుతుందని జీవీ స్పష్టం చేశారు. రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.పేద, బడుగు, బలహీనవర్గాలకు విద్యనందించేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని, డ్రాపౌట్స్ తగ్గించటంలో గొప్ప ప్రభావం చూపిందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇంటికి ఒకరికి కూడా ఇవ్వలేకపోతే కూటమి ప్రభుత్వం ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 15వేలు తల్లికి వందనం నగదు అందించి ఆ కుటుంబాల్లో విద్యాజ్యోతులు వెలిగించేందుకు కారణమైందన్నారు. తల్లికి వందనం మొదటి విడతలో అందని వారికి గ్రామ సచివాలయాల ద్వారా వారికి తిరిగి అందించి శభాష్ అనిపించుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షాఫలితాలు గణనీయంగా పెరిగాయన్నారు. గతంలో 69.76 శాతంగా ఉన్న ఉత్తీర్ణతను ప్రభుత్వ కృషితో 81.14 శాతంకు పెరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం జీవో. 117 ద్వారా రాష్ట్రంలో 4,234 పాఠశాలలు మూసివేస్తే, సుమారు 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలకు దూరమయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో. 117జీవోను రద్దు చేశామని, పాఠశాలలను పునరుద్ధరించటమేకాక, పాఠశాలలను కళాశాలలుగా అప్డేడ్చేశామని జీవీ వివరించారు.
విదేశీ విద్య వైసీపీ హయాంలో నామమాత్రంగా కేవలం 113 మందికే అందించగా, కూటమి ప్రభుత్వం ఐదేళ్ళపాటు 4,923 మందికి విదేశీవిద్య అవకాశం కల్పించిందని, ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గొప్పవరమన్నారు. జూనియర్ లెక్చరర్లకు గతంలో 1 గంటలకు రూ.150లుగా ఉన్న వేతనం రూ.375లకు పెంచి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. గతంలో యూనివర్సిటీ వీసీల నియామకం గతంలో ఇష్టారాజ్యంగా ఉండగా, నేడు ఉత్తమ ప్రొఫెసర్లకు వీసీలుగా అవకాశాలు లభించాయన్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలలు, కాలేజీలు అసాంఘిక కార్యక్రమాలు, డ్రగ్స్కు కేంద్రంగా మారితే కూటమి ప్రభుత్వం డ్రగ్పై ఈగల్ టీం ద్వారా సమూల మార్పులు తెచ్చిందన్నారు. మెగా పేరంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించి నాణ్యతా ప్రమాణాలు పెంపుకు దోహదం చేశారని, సుమారు 53.40 లక్షల మంది పేరంట్స్ ఒకే రోజు సమావేశమవటం, విద్యార్ధుల భవిష్యతు బాటలు వేయటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేషను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అభినందించారు. ప్రతి శనివారం నో బ్యాగ్ ద్వారా పిల్లలకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తిని పెంపొందించేందకు, వ్యక్తిత్వ వికాశానికి దోహదం చేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం రద్దు చేయగా, మధ్యాహ్నం భోజనం కావాలని వినుకొండ విద్యార్థులు మంత్రి లోకేషు వాట్సప్ చేయగానే వెంటనే స్పందించి మధ్యాహ్న భోజనం పథకంను పునరుద్ధరించటం లోకేష్ పాలనకు అద్దం పడుతుందన్నారు జీవీ. టీచర్లకు ఓరియంటేషన్ కార్యక్రమం ద్వారా శిక్షణ ఇచ్చి ఉత్తమ ఫలితాలు సాధనకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ట్రైన్ ది ట్రైనర్ కార్యక్రమం నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు దోహదపడుతుందని, బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు ద్వారా ఎంతో వెసులుబాటు కలుగుతుందని అన్నారు జీవీ. విద్యారంగం సమూల మార్పుతో ఉన్నత విలువలతో ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా మంత్రి నారాలోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.(Story : ఆదర్శప్రాయంగా ఏపీ విద్యావ్యవస్థ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!