Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండలో 100 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మించాలి

వినుకొండలో 100 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మించాలి

0

వినుకొండలో 100 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మించాలి

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ విజిట్ కు విచ్చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిపిఐ వినుకొండ పట్టణ సమితి నాయకులు కలిసి ఆమెకు వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలో రాసిన విషయాలన్నీ పల్నాడు జిల్లా కలెక్టర్ కి వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము వివరిస్తూ. వినుకొండ లో వంద పడకల ప్రభుత్వ వైద్యశాలను నిర్మించాలని అనేక సంవత్సరాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోరాటం చేస్తుందని, గత ప్రభుత్వం ఎన్ఎస్పి కాలనీలో నాలుగున్నర ఎకరాలు భూమిని ప్రభుత్వ వైద్యశాలకు కేటాయించారని, అక్కడ 100 పడకల ప్రభుత్వ వైద్యశాల వెంటనే నిర్మించాలని వినుకొండ నియోజకవర్గం ప్రజల పక్షాన ఆయన కలెక్టర్ ని కోరారు. అదేవిధంగా వినుకొండలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేసే పర్మినెంట్ డాక్టర్లను వెంటనే కేటాయించాలని, వినుకొండ చుట్టుపక్కల 40 కిలోమీటర్లు పైబడి ఈ ప్రభుత్వ వైద్యశాలకు పేద వర్గాల ప్రజలు ప్రైవేటు వైద్యం కొనుక్కోలేని వారందరూ ఈ హాస్పిటల్ కి వస్తారని, చిన్న చిన్న సమస్యలకు కూడా నరసరావుపేట, గుంటూరు కు రిఫర్ చేస్తున్నారని, అదేంది అని అడుగుతే ఇది 30 పడకల వైద్యశాల కనుక ఇక్కడ కావాల్సిన వైద్య పరికరాలు లేవని , పెద్ద డాక్టర్లు అక్కడ ఉంటారు కనుక అక్కడికి రిఫర్ చేస్తున్నాము అని చెప్తున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే వినుకొండ రాయలసీమకు ముఖద్వారంగా ఉండటంతో వేలాది వాహనాలు విజయవాడ వైపు నుండి రాయలసీమకు రాకపోకల మధ్య వినుకొండలో నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. రక్తం మడుగులో ఉన్న వారిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొస్తే ఇక్కడ జరిగే వైద్యం ఏందయ్యా అంటే కొంచెం ట్రెంజర్ పోసి దూది పెట్టి కట్టు కట్టి నరసరావుపేట, గుంటూరుకు రిఫర్ చేస్తూ ఉన్నారు. ఈ లోపు ఆ బాధితుల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలని చిన్నచిన్న వైద్యానికి కూడా నరసరావుపేట గుంటూరు రిఫర్ చేస్తూ ఉన్నారని ఎవరో ఒకరు ప్రశ్నిస్తే ఇది చిన్న హాస్పిటల్ కనుక ఇక్కడ ఇంతే వైద్యం అందుతుందని వారు చెబుతూ వస్తున్నారు. కావున వినుకొండ ప్రజల పట్ల దయవుంచి వెంటనే వినుకొండ కి 100 పడకల ప్రభుత్వ వైద్యశాలను నియమించాలని, అదేవిధంగా ఉన్న హాస్పిటల్లో పర్మనెంట్ డాక్టర్లను నియమించాలని భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల పక్షాన కోరుతుందని రాము కలెక్టర్ కి అన్ని విషయాలను వివరించారు. స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ వైద్యశాలకి వెళ్తున్నాని అన్ని విషయాలను పరిశీలిస్తానని కలెక్టర్ చెప్పడం జరిగింది. కలెక్టర్ ని కలిసిన బృందంలో సిపిఐ నాయకులు చీరాల అంజయ్య, షేక్ మస్తాన్, ఎస్. కె.కిషోర్, షేక్ నజీర్, దుర్గారెడ్డి, తోట నరసింహారావు, బొట్టు శీను, నర్రా వెంకటరత్నం, సత్యానందం, ఇబ్రహీం, తదితరులు ఉన్నారు.(Story : వినుకొండలో 100 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మించాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version