Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి స్థానిక వైసిపి నేతలకు లేదు

కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి స్థానిక వైసిపి నేతలకు లేదు

కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి స్థానిక వైసిపి నేతలకు లేదు

న్యూస్ తెలుగు/వినుకొండ :రాష్ట్రంలో ఐదేళ్లపాటు అరాచక పాలన చేసి 10 లక్షల కోట్లు అప్పులు మిగిల్చిన వైసీపీ నాయకులకు, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని వినుకొండ నియోజకవర్గ టిడిపి సీనియర్ నేతలు విమర్శించారు. బొల్లా బ్రహ్మనాయుడు హయాం లోనే వినుకొండ అభివృద్ధి జరిగిందని స్థానిక వైసిపి నాయకులు మాట్లాడటంపై స్పందిస్తూ, సానిక టిడిపి సీనియర్ నేతలు శుక్రవారం నాడు చీఫ్ విప్ జీవి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వినుకొండలో నాటి పులుపుల వెంకట శివయ్య నుండి నేటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచారన్నారు. కాగా పంచాయతీ కాలంలో అప్పటి జనాభా అనుగుణంగా మాత్రమే అభివృద్ధి పనులు, త్రాగునీటి సమస్య పరిష్కరించడం జరిగిందని అన్నారు. ఎటువంటి అనుభవం లేని వైసిపి నాయకులు వారి మనుగడ కోసమే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. స్థానిక ఎన్ఎస్పి స్థలం 27 ఎకరాలు జీవి ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రాష్ట్రం నుండి అనుమతులు తెచ్చి మున్సిపాలిటీకి బదలాయించడం జరిగిందన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో ఎన్ఎస్పి స్థలంలో ఒక నిర్మాణం కూడా చేపట్టలేదు అన్నారు. ఇక జీవి నేడు ఎన్నెస్పీలో పలు నిర్మాణాలకు అనుమతులు తెచ్చి టెండర్లు పిలిచే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఇక ఆనాడు జగనన్న కాలనీ పేరుతో బొల్లా తన చౌక భూములను జగనన్న కాలానికి అధిక ధరలకు ప్రభుత్వానికి అంటగట్టి 18 కోట్లు దోచుకున్నది జగమెరిగిన సత్యమన్నారు. అలాగే ఆనాడు వినుకొండ త్రాగునీటి చెరువుకు మరమ్మతలంటూ మున్సిపాలిటీ నిధులు అన్ని వైసీపీ నేతలు స్వాహా చేశారని అన్నారు. ఈ 18 మాసాల కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. అలాగే పట్టణం త్రాగునీటి శాశ్వత పథకానికి 210 కోట్లు నిధులు మంజూరు చేయించి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగిందని టిడిపి నేతలు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల వాగ్దానాలు అన్ని అమలు చేస్తున్నారని, ఆనాడు వైసిపి ప్రభుత్వం పెన్షన్లు పెంచకుండా కాలయాపన చేస్తే, నేడు కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా పెన్షన్ పెంచి ప్రతి నెల క్రమం తప్పకుండా ఇస్తున్నట్టు తెలిపారు. స్త్రీ శక్తి పథకం అమలు, మూడు గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా 20,000 ఇలా సంక్షేమ పథకాలన్నీ అమలతో పాటు, పట్టణ డ్రైనేజీ వ్యవస్థ ఎంతో మెరుగుపడిందన్నారు. ఇక వైసిపి నేతలను ప్రజలు మరిచిపోతారన్న భయంతో సమావేశాలు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ నేడు అమలు చేస్తున్నారని, జీవి ఆంజనేయులు గత 30 ఏళ్లుగా వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొంది ఎమ్మెల్యేగా మూడు మార్లు గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతుండగా, వైసిపి విమర్శలు అర్థరహితమన్నారు. వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు మానుకొని గత స్థాయి ఏంటో తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు పెమ్మసాని నాగేశ్వరరావు, పత్తి పూర్ణ, పి దాసయ్య, గంధం కోటేశ్వరరావు, బొంకూరి రోశయ్య, ఆర్. వీరాంజనేయ రెడ్డి, సౌదాగర్ జానీ భాష, హనుమాన్ నాయక్ పాల్గొన్నారు.(Story : కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి స్థానిక వైసిపి నేతలకు లేదు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!