శివరాత్రి పర్వదినం సందర్బంగా గీతాంజలి విద్యార్థుల మానవహారం
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక వెన్నపూస కాలనీ నందు గీతాంజలి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు శివరాత్రి పర్వదినం సందర్బంగా చేసిన మానవహారం విశేషంగా చూపరులను అల్లరించింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీమతి తేళ్ళ కృష్ణవేణి మాట్లాడుతూ. చిన్నారులకు ఎంతో ఇష్టమైన పండుగలలో శివరాత్రి ఒకటి అని అట్టి పార్వదినాన్ని చిన్నారుల ఆనందం కోసం మరియు దాని ప్రత్యేకతను చిన్నారులకు తెలియచేయాలి అనే సదుద్దేశంతో నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండంట్ యేండ్లూరి లక్ష్మణ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.(Story : శివరాత్రి పర్వదినం సందర్బంగా గీతాంజలి విద్యార్థుల మానవహారం )

