నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను అమలు చేయాలి.
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టబద్ధత చేయాలి..
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పల్నాడు జిల్లా వినుకొండలో విజయవంతం.
న్యూస్ తెలుగు/వినుకొండ : పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు అమలు చేయాలని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, రాష్ట్ర రైతు సంఘం నాయకులు తోట ఆంజనేయులు సిపిఎం ఏపూరి గోపాల్, సిఐటియు నాయకులు హనుమంత రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాడు ఉదయం 6 గంటల నుండి వినుకొండలో సమ్మె సైరన్ ప్రారంభమైందని, శివయ్య స్తూపం వద్ద కార్మికుల సమావేశానికి కామ్రేడ్ బూదాల శ్రీనివాస్ అధ్యక్షత వహించి, మాట్లాడుతూ.పారిశుద్ధ్య మునిసిపల్ కార్మికులు, సివిల్ సప్లై హమాలీ కార్మికులు, ముఠా కార్మికులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు , వామపక్షాల నాయకులు, కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారని గురువారం నాడు వినుకొండలో తలపెట్టిన కార్మికుల సమ్మె విజయవంతం అయింది. కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కూలదోసి కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను కార్మికులు, కష్టజీవులు, ఉద్యోగులు తిరస్కరించారని కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర నిరసనను తెలియజేస్తున్నారని, 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మికులకు సమ్మె చేసే హక్కు, వేతనాలు పెంచుకునే హక్కు, కూలి రేట్లు పెంచమనే హక్కులు కోల్పోతారని వారన్నారు. రైతాంగం తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర సాధించలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా అక్రమంగా తీసుకొచ్చి న మూడు నల్ల చట్టాలను పోరాడి తిప్పి కొట్టామని, రైతాంగా నికి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టు కోలేక పోయిందని ఆయన విమర్శించారు. రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత చేయలేదని, దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఖూనీ చేయబడుతున్నాయని తీవ్రంగా దుయ్య బట్టారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో సామాన్య ప్రజలు వాడుకునే నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, సామాన్యుని కుటుంబ జీవన వ్యయం తీవ్రంగా పెరిగిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఉలవలపూడి రాము, రాయబారం వందనం, కొప్పరపు మల్లికార్జునరావు, బండి కోటయ్య, సంపెంగుల అబ్రహం రాజు, పచ్చి గొర్ల ఏసు, దారి వేముల మరి బాబు, సాయిబాబా, కంచర్ల కోటేశ్వరరావు, రావెళ్ల శ్రీనివాసరావు, షేక్ నాగూరు, నాసరయ్య, రవి, కొండమ్మ, మార్తమ్మ, నాగరాణి, కార్మికులు మహిళలు అతిక సంఖ్యలో పాల్గొన్నారు.
(Story : నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి )

