బిజెపి పార్టీ అనుసరిస్తున్న
ఉద్యోగ,కార్మిక ,రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త సమ్మె
న్యూస్ తెలుగు/వనపర్తి : కార్మిక సంఘాలు (సిఐటియు -టియుసిఐ-ఎఐటియుసి) ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో నిరసన సభ అనంతరం పురవీధుల గుండా భారీర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా టియుసిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి .అరుణ్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి మండ్ల రాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోష*నిరసనసభలో మాట్లాడుతూ
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజా ఉద్యోగ కార్మిక రైతంగ వ్యతిరేక విధానం నిరసిస్తూ ఈరోజు దేశ వ్యాప్తంగా 30 కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారని తెలియజేశారు. దేశవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా కార్మికులు ఆందోళన చేస్తున్న బిజెపి ప్రభుత్వం మొండిగా ధనవంతులకు దండిగా ఆదాయం సమకూర్చే విధానాలలో భాగంగానే నాలుగు లేబర్ కోడ్స్ వచ్చాయని ఎద్దెవ చేశారు. అయినా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కార్పొరేటు శక్తుల లాభాలు చేకూర్చడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కార్మిక వర్గంపై రైతాంగంపై గ్రామీణ వ్యవసాయ కార్మికులపై భారాలు వేస్తున్నది .పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకోవచ్చింది దేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వారితో కొట్లాడి సాధించుకున్న చట్టాలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తున్నది చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చేందుకు ఈ లేబర్ కోడ్ లు తీసుకువచ్చింది 8 గంటల పని దినాన్ని 12 గంటల పని దినంగా మార్చాలని చూస్తుంది వేతనాలు నిర్ణయించే పద్ధతిని చర్చల ద్వారా కాకుండా ఏకపక్షంగా నిర్ణయించే పద్ధతిని తీసుకువచ్చింది యూనియన్లలో గుర్తించే విషయంలో అనేక మార్పులు తెచ్చింది .ఆయా పరిశ్రమల్లో అడ్వైజరీ బోర్డు తెస్తామని కోడ్ లో పొందుపరిచింది సామాజిక భద్రతపై దాడి చేస్తుంది పిఎఫ్, ఈఎస్ఐ ,గ్రాటివిటీ చట్టాల్లో అనేక మార్పులు చేసి యజమానుల దయ దక్షిణాలపై కార్మికులు ఆధారపడేలా చేస్తుంది .మహిళలను ప్రమాదకరమైన పనులలో రాత్రి వేళల్లో పని మరి చేయించవద్దని గత చట్టాల్లో ఉన్నప్పటికీ నేడు వాటిని రద్దుచేసి పురుషులతో సమానంగా రాత్రింబవళ్లు పనిచేయాలని పద్ధతిని తీసుకువచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. కోట్ల రూపాయల ప్రజల డబ్బుతో రైల్వే స్టేషన్స్ ఆధునికరించి పెట్టుబడిదారులకు ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నది. పేద ప్రజల భూములను లాక్కోవడానికి తెచ్చిన మూడు నల్ల చట్టాలను సంవత్సరం పైగా చలికాలం వర్షాకాలం ఎండాకాలం తట్టుకొని నిలబడి రైతులపోరాటం వల్ల ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చినప్పటికీ ఇతర రూపాలలో రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తుంది. విత్తన చట్టం 2025 ముసాయిదా విద్యుత్తు సవరణ బిల్లు విబిజి రాంజీ చట్టం ఇతర చట్టాలలో ముందుకు తెచ్చింది. రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని పోరాడితే రాతపూర్వకంగా హామీ ఇచ్చిన నేటికి నెరవేర్చలేని బిజెపి ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది అన్నారు.దీని ఫలితంగా జీవనోపాధి కోసం నగరాలకు వలసలు పెరుగుతున్నాయి నేడు జాతీయ వ్యవసాయం మార్కెట్ ముసాయిదా పత్రం ద్వారా రద్దయిన చట్టాలలోని అంశాలను ముందుకు తెస్తూ రైతాంగం పై దాడి చేస్తున్నది స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు కట్టపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది ఈ విధానాల ఫలితంగా ఏటా పదివేల మంది రైతులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి వాటి సవరణకు కనీసం మద్దతు ధర చట్టం తేవాలని అనే రసాలు విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం పెరచెను పెడుతున్నది కార్పొరేటర్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు వివిధ ట్యాక్సీ ల పేరుతో రద్దు చేస్తున్నది ప్రభుత్వం రైతాంగానికి మాత్రం రుణమాఫీ చేయడానికి చేతులు రావడం లేదు అందుకే ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజుదేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు వ్యవసాయ కార్మికులకు పెద్ద ఎత్తున పాల్గొన్న అందరికీ విప్లవ జేజేలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో *సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పాల్గొని సంపూర్ణ మద్దతు చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మేకల ఆంజనేయులు, నాయకులు మహబూబ్ పాషా RTC-SWF జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య ఎల్ఐసి యూనియన్ నాయకులు రామకృష్ణ ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయి లీల, వికలాంగుల జాతీయ వేదిక రాష్ట్ర నాయకులు నరసింహ ,నాయకులు ఢీ కుర్మయ్య ,నంది మళ్ళ రాములు ,పుష్ప, హనీఫ్,
టి యు సి ఐ జిల్లా సహాయ కార్యదర్శి బోయిన్పల్లి గణేష్ జిల్లా కోశాధికారి ఏదుట్ల కురుమయ్య, జిల్లా నాయకులు ఎన్ .శీను గట్టమ్మ, పెంటయ్య, కరీం ,చంద్రమ్మ ,నిరంజన్ బాలమైసయ్య , ఎస్ వెంకటయ్య గంగమ్మ నాగమ్మ,ఏ ఐ టి యు సి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, రమేష్ శాంతమూర్తి రాములు శోభారాణి వెంకటయ్య వంశీ* తదితరులు ప్రసంగించారు,పాల్గొన్నారు .(Story : బిజెపి పార్టీ అనుసరిస్తున్న )

