వినుకొండలో నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం
న్యూస్ తెలుగు/వినుకొండ : గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన 1200 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తూ మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయంపై వినుకొండలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు, వినుకొండ నియోజకవర్గ తెలుగు యువత మరియు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుండి శివయ్య స్తూపం వరకు కొనసాగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు విడుదల చేసిన లోకేష్ కి ఈ సందర్భంగా నాయకులు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.(Story : వినుకొండలో నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం )

