Home వార్తలు మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

0

మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

న్యూస్ తెలుగు/వనపర్తి : గోపాల్‌పేట మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పరిశీలించారు. సన్నబియ్యంతో వండిన అన్నంతో పాటు, పప్పు కూరగాయలను, రాగిజావను ఆయన చూశారు విద్యార్థులకు తయారుచేసే భోజనం పట్ల అశ్రద్ధ వహించరాదని ఎప్పటికప్పుడు తాజా కూరగాయలతో నాణ్యవంతమైన భోజనాన్ని మెనూ ప్రకారం వట్టించాలని ఆయన అధికారులకు, పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులను తీసుకువచ్చిందని విద్యా వ్యవస్థను బలోపేతం చేసి తెలంగాణకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ముందుకెళుతున్నట్టు ఆయన చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version