Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ చేసి మహా పాపం చేశారు..

శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ చేసి మహా పాపం చేశారు..

శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ చేసి మహా పాపం చేశారు..

పాలు లేకుండా నెయ్యి తయారుచేసిన వైసీపీ ఘనలు

తల్లి పాలు కూడా కల్తీ చేయగల దుర్మార్గులు..

కల్తీ గాళ్లు తప్పు తెలుసుకొని స్వామి వారిని క్షమాపణ అడగండి

న్యూస్ తెలుగు/వినుకొండ : వైసిపి హయాంలో 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి కానీ దాన్ని నెయ్యి పేరిట సరఫరా చేసారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చిందని, దీనికి నెయ్యి కల్తీ ముఠా ఏమి సమాధానం చెబుతుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. పాలే లేకుండా పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్ తో సిద్ధం చేసిన పదార్థాన్ని నెయ్యి ముసుగులో సరఫరా చేసి మహా పాపానికి ఒడికట్టారని అన్నారు. శ్రీవారి లడ్డూలో సువాసనలు వచ్చేందుకు బీటా కెరోటిన్ లాంటి రసాయనాలను కలిపినట్లు సిట్ నివేదికలో తెలిందన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు, దీనితో 20 కోట్ల కు పైగా లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేశారని, ఈ కుంభకోణంలో 235 కోట్ల టీటీడీ నిధులు దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లు నివేదిక వివరించిందన్నారు. దేవదేవుడి ప్రసాదం విషయంలో జరిగిన మహా కల్తీ గుట్టు రట్టైందని, నాటి వైసిపి నేతలు తల్లి పాలు కూడా కల్తీ చేయగలిగే దుర్మార్గులని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల వైసిపి పాలనలో టీటీడీ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి కల్తీ కి రహదారి నిర్మించి తిరుమలను అక్రమాల పుట్టగా మార్చారన్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉన్నా.. జగన్మోహన్ రెడ్డి మాత్రమే పట్టు వస్త్రాలు ఇచ్చి హిందూ సంప్రదాయాలను కాలరాచాడని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేని గ్యాంగును తెచ్చి అందలం ఎక్కించి తిరుమల పవిత్రత మంటగోలిపారని, తిరుమలను అక్రమార్చనకు ఆదాయ వనరుగా మార్చుకొని రాజకీయ దుర్బుద్ధితో మత విశ్వాసం రెచ్చగొట్టిన దుర్మార్గులని ఆవేదన చేశారు. ఇప్పటికైనా శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ గాళ్ళు తప్పు తెలుసుకొని స్వామివారిని క్షమాపణ అడిగితే బాగుంటుందని, లేకపోతే వాళ్ళ పాపానికి నిస్కృతి లేదన్నారు. కాగా… వినుకొండ పట్టణం శ్రీనివాస నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో భారీ కల్తీ జరిగినట్లు వెలుగులోకి రావడం, స్వామివారి ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా, పామాయిల్ మరియు ఇతర రసాయనాలు కలిపిన ద్రవాన్ని వినియోగించారని సిట్ విచారణలో స్పష్టమవ్వడంతో భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడాన్ని భక్తులు “మహా పాపం”గా అభివర్ణిస్తున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న దర్యాప్తులో భాగంగా, ప్రసాదం తయారీలో వాడింది నెయ్యి కాదని, అది పామాయిల్ మరియు కెమికల్స్ మిశ్రమమని అధికారులు తేల్చారు. ఈ అపవిత్రతను తొలగించేందుకు టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.(Story : శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ చేసి మహా పాపం చేశారు..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!