మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టర్ పెబ్బేరులోని మున్సిపల్ కార్యాలయం, కొత్తకోటలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల కేంద్రాల్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిటర్నింగ్ అధికారులు పబ్లిష్ చేసిన ఎన్నికల నోటీస్ ఫామ్ 1 పరిశీలించారు. అనంతరం హెల్ప్ డెస్క్ లో నామినేషన్లు వేయడానికి వచ్చేవారికి కావాల్సిన సమాచారాన్ని అందించాలని సూచించారు. ఓటర్ జాబితాను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, స్వీకరించిన నామినేషన్లను ఎప్పటికప్పుడు ‘టి-పోల్’ (T-Poll) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని సూచించారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారికి సింబల్స్ ని చూపించాలని సూచించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు మరియు ఇతర రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.(Story : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలి)

