చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఫర్ గర్ల్స్’ ప్రారంభం
న్యూస్ తెలుగు (చింతూరు) : చింతూరు లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ పి యం ఉష ఆర్థిక సహకారంతో బుధవారం నుండి “సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఫర్ గర్ల్స్” ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం తెలియజేశారు. ట్రైనింగ్ ప్రారంభం సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మహిళల ఆత్మ రక్షణకు పది రోజుల పాటు ఇచ్చే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ట్రైనర్స్ గా ఒంగోలు రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నుండి లక్ష్మణ్, రాజేష్, చంటి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎమ్.శేఖర్, పి యం ఉష కోఆర్డినేటర్ జి.వెంకట్రావు, డాక్టర్ కె. శకుంతల, జి. హారతి, ఎస్ అప్పనమ్మ, జి. సాయికుమార్, ఎన్. ఆనంద్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.(Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఫర్ గర్ల్స్’ ప్రారంభం)

