వైసీపీని వీడి టీడీపీలో చేరిన 70 కుటుంబాలు
న్యూస్ తెలుగు/వినుకొండ : తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతోంది. బుధవారం వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ వారి కార్యాలయం నందు శావల్యాపురం మండలం, పొట్లూరు గ్రామానికి చెందిన సుమారు 70 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, జీవి నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు ఆయా కుటుంబాల ప్రతినిధులు తెలిపారు. నాయకులు, తదితరులు పాల్గొన్నారు.(story : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 70 కుటుంబాలు )

