Home వార్తలు తెలంగాణ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధించాలి

సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధించాలి

0

సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధించాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యములో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణములో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం పట్టణ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్ అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇట్టి సమావేశములో మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ స్వామిగౌడ్ మాజీ శాసన మండలి చైర్మన్ హాజరై మాట్లాడినారు. స్వామి గౌడ్ గారు మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల బానిస పాలనకు చరమగీతం పాడి తెలంగాణకు కె.సి.ఆర్ విముక్తి కలిగించారని కానీ నేడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఆంధ్ర పాలకుల తొత్తుగా మారి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు అని ఆరోపించారు.మున్సిపల్ ఎన్నికల్లో కె.సి.ఆర్ సంక్షేమ పథకాలు,మనం చేసిన అభివృద్ధి వివరించి ఓట్లు అభ్యర్థించాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి ఐకమత్యంగా పనిచేసి గెలిపించుకోవాలని టికెట్ రాని వారు నిరాశ చెందవద్దని పార్టీ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని బరోసా ఇచ్చారు. 420హామీలు,6గ్యారంటీలు అమలు చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మహిళలకు 2500,ఆసరా పింఛన్లు 4000,కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా విద్యార్థినులకు స్కూటీలు ధాన్యానికి బోనస్ గ్యాస్ సబ్సిడీ రైతులకు రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు బీమా వంటి పథకాలు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బైక్ ర్యాలీకి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని ప్రజలు మళ్ళీ సి.ఎం.కావాలని కోరుకుంటున్నారని అన్నారు. పట్టణములో అభ్యర్థుల గురించి పార్టీ అంతర్గత సర్వేలు నిర్వహిస్తుందని పార్టీ పట్ల విశ్వాసం విధేయత కార్యకర్తల ఏకాభిప్రాయం కలిగిన వాళ్లను అభ్యర్థులుగా నిలబెడతామని అందరం సమిష్టిగా పనిచేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
టిక్కెట్లు రాని వాళ్ళు సమర్థులు కారని పార్టీ అభిప్రాయం కాదని వారికి కూడా పార్టీ తగిన రీతిలో గౌరవం,ప్రాధాన్యత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి కె.సి.ఆర్ గారికి మన తరపున బహుమతి ఇద్దామని ప్రతిజ్ఞ చేశారు.
నా కోసం మీరు కష్టపడ్డారు అని మీ కోసం నేను కస్టపడి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలుపుతానని అన్నారు. పెద్ద సంఖ్యలో ర్యాలీ,సమావేశములో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,కె.మాణిక్యం,మాజీ కౌన్సిలర్స్,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version