మనం చేసిన పట్టణ అభివృద్ధి మనకు శ్రీరామ రక్ష
న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణ నాయకులకు,కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ మన హయాములో కనివిని ఎరుగని రీతిలో పట్టణ అభివృద్ధి జరిగిందని 25నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఊసులేదు అభివృద్ధి లేక ఆర్థిక లావాదేవీలు లేక ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. అభివృద్ధి అనేది బి.ఆర్.ఎస్ కంటే ముందు బి.ఆర్.ఎస్ తర్వాత అనే విధంగా ప్రజల ఆలోచన ఉందని ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీనీ ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. దశాబ్దాల ప్రజల కల రోడ్ల విస్తరణ,జిల్లా కేంద్రం,పార్కుల సుందరీకరణ, చెరువుల దురస్తూతో పట్టణం చూడ ముచ్చటగా తయారు అయ్యిందని అన్నారు. హైదరాబాద్ తరహాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్,టౌన్ హాల్,అంతర్గత రోడ్లు,మిషన్ భగీరథతో 24గంటల మంచినీరు,కంటి రెప్పపాటు కూడా లేని కరెంట్ కోత అన్ని మౌలిక వసతులు కల్పించుకొని పట్టణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దినామని మనం చేసిన అభివృద్ధి మనకు శ్రీరామ రక్షగా కాపాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుని ప్రజలలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.(Story : మనం చేసిన పట్టణ అభివృద్ధి మనకు శ్రీరామ రక్ష )

