Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండలో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

వినుకొండలో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

వినుకొండలో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

న్యూస్ తెలుగు/వినుకొండ : దేశభక్తి ఉట్టిపడేలా వినుకొండ ప్రజలు 77వ గణతంత్ర వేడుకలు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ జాతీయ జెండాను ఆవిష్కరించగా, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి మాట్లాడుతూ. అంబేద్కర్ తో పాటు ఆనాడు మరో ఏడుగురు మేధావులతో రూపొందించిన రాజ్యాగంతో అన్ని వ్యవస్థలు ఏర్పడి, ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చిందన్నారు. అయితే ప్రజలకు రాజకీయ వ్యవస్థపై కొంత అసంతృప్తి ఉన్నదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం, శానిటేషన్ విభాగంలో అంకిత భావంతో పనిచేసిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కంచర్ల కోటేశ్వరరావు, ఏ పుల్లయ్య, కటకం ఆంజనేయులు, భాగ్యలక్ష్మి, లక్ష్మయ్య, వై పార్వతి, మరో ఆరుగురు ప్రశంసా పత్రాలు అందుకోగా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ గంటా కాలేశా, టి రాజేష్ ఖన్నా, బేతం గాబ్రియేలు, పి బ్రహ్మయ్య, రెడ్డి నాగ పద్మ, ఎం ఎస్ కే భాష, మున్సిపల్ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఏఈ ఆదినారాయణ, పి పూర్ణ, శానిటేషన్ అధికారి ఎస్కే ఇస్మాయిల్, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. అలాగే వినుకొండ మున్సిపాలిటీలో ఉత్తమ సేవలందించిన కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ ను పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అలాగే ఎక్సైజ్ సీఐ దేవర శ్రీనివాసరావు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. స్థానిక ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ జే నాగేశ్వరరావు జెండాను ఆవిష్కరించగా, ఎస్ టి ఐ. ధనలక్ష్మి వివిధ యూనియన్ నేతలు కార్మికులు పాల్గొన్నారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఎస్ సురేష్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించగా, డిప్యూటీ తాసిల్దార్ సిహెచ్ మురళి, ఆర్ ఐ శ్రీహరి, కార్యాలయ సిబ్బంది పాల్గొనగా, గీతం స్కూల్లో గీతం విద్యాసంస్థల అధినేత మాలపాటి కోటిరెడ్డి జండా ఆవిష్కరించగా, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు….. అలాగే వైసిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. డాక్టర్ అంబేద్కర్ తో సహా ఎంతో మంది మేధావులు రాజ్యాంగం రూపొందించి, స్వేచ్ఛ హక్కును కల్పించగా, నేడు కూటమి ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని నిర్వీరం చేస్తూ రెడ్ బుక్కు రాజ్యాంగాన్ని ప్రజలపై ప్రయోగిస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. అమ్మిరెడ్డి అంజిరెడ్డి , ఈపూరు జడ్పిటిసి చౌడయ్య,
పల్నాడు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్, ఎం ఎస్ కే భాష, దండు చెన్నయ్య, పుల్లారెడ్డి, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే బిజెపి కార్యాలయంలో కట్టా సుబ్బారావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్మన్ మీసాల మురళీ కృష్ణ యాదవ్ జెండాను ఆవిష్కరించి రాజ్యాంగ నిర్మాతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశభక్తులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో యార్డు డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.(Story : వినుకొండలో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!