Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ నిరుద్యోగి రణభేరి కొలువులకై కొట్లాడుదాం రండి.

నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ నిరుద్యోగి రణభేరి కొలువులకై కొట్లాడుదాం రండి.

0

నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ నిరుద్యోగి రణభేరి కొలువులకై కొట్లాడుదాం రండి.

న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక సిపిఐ ఆఫీస్ వినుకొండ శివయ్య భవనంలో అఖిల భారత యువజన సమాఖ్య( ఏఐవైఎఫ్ ) ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 30వ తారీకు విజయవాడలో జరుగుతున్న నిరుద్యోగి రణభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వాల్ పోస్టులను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అఖిలభారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ వినుకొండ ఏరియా కార్యదర్శి దారి వేముల మరియబాబు మాట్లాడుతూ. “కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం రాష్ట్రంలో ఉన్న యువతకు మేము అధికారంలోకి రాగానే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల అవకాశాలు ఇవ్వటంలో నిరుద్యోభివృద్ధి ఇవ్వటంలో విఫలం చెందిందని, జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నదని, జాబ్ అయితే లోకేష్ బాబు కి మంత్రి పదవి రూపంలో వచ్చింది కానీ రాష్ట్రంలో ఉన్న యువతకు మాత్రం ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి, రాష్ట్ర ప్రభుత్వం శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి, ఎన్నికల హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించాలి, వారికి పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలి, జూనియర్ డిగ్రీ కళాశాలలో, యూనివర్సిటీల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి, నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలి, ఏపీ బీహార్ ఎస్ ఎస్ లో పనిచేసిన నిరుద్యోగులకు న్యాయం చేయాలి, రేషన్ వాహనాల్లో తొలగించిన నిరుద్యోగులకు న్యాయం చేయాలి, ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలి, నూతన పరిశ్రమలు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఈ నెల 30 వ తారీకు విజయవాడ నగరంలో అఖిలభారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ కే హుస్సేన్, భాష, మస్తాన్, సుభాని, నల్లబోతుల శీను, నక్క జ్యోతి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.(Story : నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ నిరుద్యోగి రణభేరి కొలువులకై కొట్లాడుదాం రండి. )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version